politics

తమిళనాడు సీఎంలు.. నల్ల కళ్లద్దాలు ఎందుకు ధరించారంటే..?

తమిళనాడు సీఎం గా పని చేసిన ఎంజి రామచంద్రన్ గురించి అందరికీ తెలుసు. ఆయన సినిమాల్లో నటుడిగా రాణించాక రాజకీయాల్లోకి కూడా వచ్చారు. సిఎంగా తమిళనాడును 1977 నుంచి 1987 సంవత్సరాల మధ్య పాలించాడు. ఇక కరుణానిధి రచయిత,రాజకీయ నాయకుడిగా మారారు. తమిళనాడు ను దాదాపుగా రెండు దశాబ్దాల పాటు ఐదుసార్లు సీఎం గా పాలించాడు. 1969 నుంచి 2011 వరకు మధ్య సీఎంగా పని చేశారు. అయితే ఈ ఇద్దరిలోనూ మనం ఒక కామన్ విషయాన్ని గమనించవచ్చు.అది ఏంటయ్యా అంటే..

ఎంజి రామచంద్రన్ కరుణానిధి ఇద్దరు నలుపు రంగు సన్ గ్లాసెస్ ధరించేవారు. చాలామందికి అసలు విషయం తెలియక వారు అద్దాలను స్టైల్ కోసం ధరిస్తారని అనుకునేవారు. కానీ అసలు విషయానికి వస్తే వారు ఈ గ్లాసెస్ను ధరించేది స్టైల్ కోసం కాదు అని,ఎంజీ రామచంద్రన్ కు కంటి సమస్య ఉండేదని, అందువల్ల ఆయన సూర్యకాంతి లైట్ ను చూడకూడదని గ్లాసెస్ ధరించాలని వైద్యులు సూచించారట. దీంతో ఆయన గ్లాసెస్ ధరించడం మొదలుపెట్టారు. ఆయన గ్లాసెస్ లేకుండా బయట దాదాపుగా ఎప్పుడు కనిపించలేదు.

do you know why 2 tamil nadu cms wear black glasses

ఇక కరుణానిధి 1960లలో యాక్సిడెంట్ వల్ల ఎడమ కన్ను కోల్పోయారు. ఈ క్రమంలోనే కంటి వైద్యులు ఆయనకు కూడా అద్దాలను ధరించాలని సూచించారు. దీంతో కరుణానిధి కూడా అప్పటినుంచి అద్దాలను ధరిస్తూ వచ్చారు. అయితే యాదృచ్ఛికంగానే తమిళనాడు ఇద్దరు సీఎంలకు కంటి సమస్యలు రావడం, గ్లాసెస్ ధరించడం జరిగింది. కానీ అద్దాల వల్ల వారు స్టైల్ ఐకాన్ గా మారారు. కార్టూనిస్టులు ఆ అద్దాలతోని వారి బొమ్మలు గీసి కార్టూన్ వేశారు. కానీ వారు ఎప్పుడూ కూడా వారి అద్దాలను తీసి బయట కనిపించలేదు.

Admin

Recent Posts