politics

పాకిస్తాన్ భారతదేశంపై ముందస్తు హెచ్చరిక లేకుండా అణు ఆయుధాలతో దాడిచేస్తే ఏమవుతుంది?

చీటికీ మాటికీ అణ్వాయుధాలు వాడతాను అని పాక్ ఎప్పుడూ అంటూనే ఉంటుంది. ఒకవేళ మనపై ఉపయోగిస్తే అది రెండు రకాలుగా ఉంటుంది. Tactical Nukes ( వ్యూహాత్మకంగా చిన్న అణుబాంబు). శత్రు సైన్యం పాక్ భూభాగాన్ని అక్రమించుకుంటుంటే తన భూభాగం లో ఉన్న శత్రువు మీద ఉపయోగిస్తాను అంటుంది. ఇంకొకరి భూమి మీద మేము బాంబు వేయడం లేదు మా భూమిమీద వేసుకుంటున్నాం అన్న సాకు చెబుతారు. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి భారత్ చేసే పని. పాకిస్తాన్ లోపలికి చొచ్చుకుపోకుండా ఎక్కువ ప్రాంతాలలో తక్కువ తక్కువ భూమిని ఆక్రమించుకొని పాక్ కి అణ్వాయుధం వాడటానికి తగిన కారణం ఇవ్వకపోవడం.

పెద్ద అణుబాంబు. పాకిస్తాన్ దీనిని వాడితే ? భారతదేశం క్షిపణి విధ్వంసక ఆయుధాలని సమకూర్చుకుంటోంది. ఉదాహరణకి S400 ఉపయోగించి వాటిని నాశనం చేసే ప్రయత్నం చేయ‌వ‌చ్చు. అయితే ప్రయత్నం ఫలించలేదు అనుకుందాం. మన ముఖ్య నగరాలు నాశనం అయిపోయాయి అనుకుందాం. అసలు తిరిగి ఎదురు దాడి చేసే అవకాశం లేనంత దారుణం గా దాడి జరిగింది అనుకుందాం. అప్పుడు?

what is pakistan uses nuclear missiles on india

న్యూక్లియర్ ట్రయాడ్.. మన అణు జలాంతర్గాములు అణు ఇంధనం తో నడుస్తాయి, అణ్వాయుధలు మోసుకుని వేరే వేరే చోట సముద్ర గర్భం లో తిరుగుతూ ఉంటాయి. భారత దేశం మొత్తాన్ని నాశనం చేసినా, దానికి కారణం అయిన వారిని మిగల్చకుండా అవి ప్రతిదాడి చేస్తాయి. మనం పోయాక ఇక ఇలా చేసి మాత్రం ఏంటి లాభం అంటారా? అలా శిక్షించగల సామర్థ్యం కలిగివుండటం చేత శత్రువులు అక్కడిదాక తెచ్చుకోవడానికి 10 సార్లు ఆలోచించాలి. సామర్థ్యం ఉండటం ఒకెత్తు దాన్ని సవ్యం గా వినియోగించుకోగలిగే ప్రభుత్వం, నాయకత్వం ఉండటం మరొక ఎత్తు.

Admin

Recent Posts