politics

అమెరికా బిన్ లాడెన్‌ను చంపినట్లుగా ఎందుకని మన భారత ప్రభుత్వం దావూద్ ఇబ్రహీంను చంపాలని సాహసించట్లేదు?

ఒక సుబ్బారావు గారు తన ఇంట్లో కుక్కని పెంచుతున్నారు, కుక్కని పెంచడం లో ఆయన ఉద్దేశ్యం, తనకి నచ్చని ఇరుగు పొరుగు వారిని కరిపించడం , భయబ్రాంతులకు గురి చేసి, వికటాట్టహాసం చేయడం.. సరే అంతా బాగానే ఉంది.. ఒక శుభ ముహూర్తాన ఆయన గారు పెంచుతున్న శునక రాజం ఆయన్నే కరిచి, షాక్ ఇచ్చిందట..అదేంటి నేను పెంచిన కుక్క నన్నే కరుస్తావా అని అడగడంతో, ఆ కుక్క తన భాష లో “కరవడం నేర్పావు కానీ, తన పర బేధం చూడమని చెప్పలేదు కదా” అందట..ఆ తర్వాత ఆ సుబ్బారావు ఆ కుక్కని ఏమి చేసాడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా!

మీ ప్రశ్నకి, ఈ కుక్క కధ కి సంబంధం ఏంటి అంటారా? చాలా సులభం, లాడెన్ అనే వాడు, అమెరికా అనే అగ్ర రాజ్యానికి ఒక పెంపుడు కుక్క లాంటి వాడు.. కరవమన్నంత కాలం అనేక దేశాల మీద పడి విధ్వంసం చేసాడు.. అవసరం తీరిపోయినా పోన్లే అని వదిలేసేవారేమో, కానీ తనను పెంచి పోషించిన దేశాన్ని బ్లాక్ మెయిల్ చేయడం, ఆ దేశం మీదే ఎవరూ ఊహించని అతి పెద్ద వైమానిక దాడి(9/11) చేయడం ద్వారా తన గొయ్యి తానే తవ్వుకున్నాడు ఈ అపర కోటేశ్వర ఉగ్రవాది లాడెన్.. ఇంక ఉపెక్షించలేదు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా, మిత్ర దేశం అని పేరున్న పాకిస్తాన్ సహకారంతో అనుపానులు కనిపెట్టి, లైవ్ లో చూస్తూ మరీ లాడెన్ కి పిండం పెట్టే కార్యక్రమం, శవాన్ని ఎవరికి దొరకకుండా సముద్రంలొ విసిరేయడం, అప్పట్లో పెద్ద సంచలనం..

why india not taking action on dawood ibrahim

ఇప్పుడు మన దేశ వజ్రం దావూద్ దగ్గరకి వస్తే, దావూద్ అనేవాడికి ఆశ్రయం ఇస్తున్న దేశం ఎవరనేది చిన్న పిల్లలకి కూడా తెలుసు..మన దేశానికి ఉన్న రా అనే నిఘా వ్యవస్థ తలుచుకుంటే , దావూద్ శవాన్ని కూడా సముద్రంలొ కలిపేయడం పెద్ద విషయం కాదు, అసలు యూపీఏ హయాంలో ఒకసారి మన రా ఏజెంట్స్ అతగాడిని మట్టు పెట్టే ప్రయత్నంలో చాలా దగ్గరకి ( point blank range) కి వచ్చారు అంటారు..అయితే అనూహ్యంగా ఒక్క ఫోన్ కాల్ రావడంతో, ఆపరేషన్ దావూద్ నిలిచిపోయింది అంటారు..ఇందులో నిజానిజాలు నిర్ధారించడం అంటే కష్టం, కానీ అప్పట్లో టాక్ అయితే నడిచింది..

ఇక్కడ మీరు మరొక పోలిక కూడా గమనించాల్సి ఉంది..దావూద్ నీ మన దేశం తయారు చేయలేదు, కానీ ఇక్కడ చట్టాల్లో ఉన్న లొసుగులు, అవినీతి నాయకుల వల్ల దేశం దాటి , మన దేశానికి తలపోటుగా మారాడు.. అంతర్జాతీయ చట్టాలు, ఇంటర్ పోల్ సహకారంతో కూడా వాడిని పట్టుకోవడం అంత సులభం కాదు, ఎందుకంటే భద్రత సమితి లో భారత్ కి శాశ్వత సభ్యత్వం లేదు, ఏదైనా ఒక పేరుని ఉగ్రవాది గా ప్రకటించాలని భారత్ కోరడం, చైనా మాత్రం వాడు ఉగ్రవాది కాదని, గౌతమ బుద్ధుడు మళ్ళీ పుట్టాడని, వితండవాదం చేసి, మన చేతులు కట్టిస్తుంది.. అంతర్జాతీయ సంబంధాలు, వ్యవహారాలు ఇలా చాలా సంక్లిష్టంగా, సీరియల్ లాగా ఉంటాయి..

అమెరికా కి ఈ తరహా సంక్లిష్టత లు ఉండవు, ఒక కుక్కని చంపాలి అంటే దానికి పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి, అనే సామెత నీ చక్కగా వంట పట్టించుకున్నారు ..భద్రతా మండలి ప్రశ్నించే సాహసం చేయదు, చేసినా అమెరికా లెక్క చేయదు అని తెలుసు కనుక.. చివరగా నేను చెప్పేది ఏంటంటే. అమెరికా – భారత్ ఎలాగైతే ఒకటి కాదో,అలాగే లాడెన్ – దావూద్ కూడా..

Admin

Recent Posts