lifestyle

స్త్రీల‌కు ఈ సంద‌ర్భాల్లో భావోద్వేగాలు క‌ట్ట‌లు తెంచుకుంటాయ‌ట‌..!

కోపం, చిరాకు, బాధ‌, దుఃఖం, ఆనందం.. ఇవ‌న్నీ మ‌నిషికి ఉండే భావోద్వేగాలు. నిత్యం ఆయా సంద‌ర్భాల్లో మ‌న‌కు ఇవ‌న్నీ క‌లుగుతుంటాయి. ఇవి మ‌న ఆరోగ్యాన్ని కూడా ప్ర‌భావితం చేస్తుంటాయి. అయితే చాలా వ‌ర‌కు స్త్రీలు ఇంట్లోనే ఉండి ఇంటి ప‌నులు చేస్తుంటారు క‌నుక వారికి నిత్యం ప‌లు సంద‌ర్భాల్లో కామ‌న్‌గా భావోద్వేగాలు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. ఆయా సంద‌ర్భాల్లో వారు విప‌రీత‌మైన కోపం, విసుగు చెందుతార‌ట‌. వారికి ఈ భావోద్వేగాలు ఎక్కువ‌గా ఏయే సంద‌ర్భాల్లో వ‌స్తాయో ఇప్పుడు చూద్దాం.

తాము ఉత‌కాల్సిన బ‌ట్ట‌లు ఎదురుగా గుట్ట‌లా ప‌డి ఉంటే అలాంటి సంద‌ర్భాల్లో స్త్రీల‌కు ఎక్క‌డ లేని కోపం, చిరాకు వ‌స్తాయ‌ట‌. ఈ ప‌ని నుంచి ఎటైనా పారిపోతే బాగుండును అని ఫీల‌వుతార‌ట‌. చింద‌ర వంద‌ర‌గా ప‌డి ఉన్న వ‌స్తువులు, ఇంట్లో పేరుకుపోయిన దుమ్ము, ధూళిని చూసిన‌ప్పుడు కూడా అస‌హ‌నం వ‌స్తుంద‌ట‌. ఇంత ప‌ని ఎలా చేయాలా.. అని ఫీల‌వుతార‌ట‌.

women feel more stressed in these situations

వంట గదిలో పేరుకుపోయిన వంట‌పాత్ర‌ల‌ను క‌డ‌గాలంటే ప్రాణానికి వ‌స్తుంద‌ట‌. ఈ ప‌ని ఎవ‌రైనా చేసి పెడితే బాగుండును అని ఫీల‌వుతార‌ట‌. అలాగే ఇల్లు తుడ‌వ‌డం, బాత్ రూమ్ క‌డ‌గడం, తోట‌ప‌ని, పిల్ల‌ల ప‌ని వంటి అనేక ప‌నుల‌ను చేసిన‌ప్పుడు కూడా వారికి విసుగు, చిరాకు వ‌స్తాయ‌ట‌. కానీ ఇలాంటి సంద‌ర్భాల్లో పురుషులు కాస్త స‌హాయం చేస్తే స్త్రీలు ఎంతో రిలీఫ్‌గా ఫీల‌వుతార‌ట‌. త‌మ భ‌ర్త‌ను వారు బ‌య‌ట‌కు పొగ‌డ‌కున్నా లోలోప‌ల ఎంతో సంతోష ప‌డ‌తార‌ట‌. క‌నుక భ‌ర్త‌లూ.. వింటున్నారా.. ఈ విష‌యంపై దృష్టి సారించండి మ‌రి..

Admin

Recent Posts