ప్ర‌శ్న - స‌మాధానం

షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు పనస తొనలు తినవచ్చా?

ప‌న‌స పండ్ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. ఇవి ఎంతో తియ్య‌గా ఉంటాయి. క‌నుక చాలా మంది ఈ పండ్ల‌ను ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పండ్లలో పొటాషియం, ఫైబ‌ర్‌, విట‌మిన్లు ఎ, సి, బి6 అధికంగా ఉంటాయి. ఇవ‌న్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. షుగ‌ర్ వ్యాధి ఉన్న‌వారు ప‌న‌స పండ్ల‌ను తింటే అధికంగా తిన‌కూడ‌దు. మోతాదులో తింటే మేలే జ‌రుగుతుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప‌న‌స పండ్ల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తుంది. ఫైబ‌ర్ వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి. అందువ‌ల్ల ప‌న‌స తొన‌లు తియ్య‌గా ఉన్న‌ప్ప‌టికీ వాటిల్లో ఉండే ఫైబ‌ర్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను నియంత్రిస్తుంది. క‌నుక షుగ‌ర్ ఉన్న‌వారు ప‌న‌స పండ్ల‌ను తిన‌వ‌చ్చు.

ప‌న‌స పండ్ల‌లో విట‌మిన్లు ఎ, సి అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండ్ల‌లో ఉండే పొటాషియం ర‌క్తం పీహెచ్ స్థాయిల‌ను నియంత్రిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ప‌న‌స పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి. ర‌క్తంలో చ‌క్కెర అంత త్వ‌ర‌గా విడుద‌ల కాదు. ప‌న‌స పండ్ల‌కు చెందిన గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ 50 వ‌ర‌కు ఉంటుంది. క‌నుక ఈ పండ్ల‌ను డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఎలాంటి భ‌యం లేకుండా తిన‌వ‌చ్చు. కానీ మోతాదులోనే తినాలి.

can diabetic people take jackfruit

ప‌న‌స పండ్ల‌ను సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్ రూపంలో తింటే మంచిది. దీని వ‌ల్ల జంక్ ఫుడ్‌ను తిన‌రు. ఈ పండ్ల‌ను తింటే క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. దీంతో జంక్ ఫుడ్ తిన‌కుండా ఉంటారు. ఇది అధిక బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తుంది. ఇలా ప‌న‌స పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts