lifestyle

పెళ్లయిన కొత్తలోనే కొంద‌రు విడాకులు తీసుకుంటున్నారు.. దీనికి కార‌ణాలు ఏమిటి..?

అందరూ ఊహించుకునే పెళ్లి అంటే – రెండు మనసులు కలవడం, కుటుంబాలు ఏకం కావడం, ఒక కొత్త జీవితాన్ని కలిసి అందంగా తీర్చిదిద్దుకోవడం. కానీ, పెళ్లయిన కొన్ని రోజులకే విడాకులు తీసుకునే జంటల సంఖ్య పెరుగుతోంది. అసలు కారణం ఏమిటి? ప్రేమ లోపమా? నమ్మకానికి చీలికా? ఆర్థిక భారం, ఇగో క్లాష్, లేక సంబంధాల్లో మారిపోతున్న నడవడికలు? మొదట్లో ఇష్టపడిన జంటలు, కొన్ని రోజుల్లోనే దూరమవుతున్నారు. ఎందుకు? ఎందుకంటే, మనం పెళ్లంటే కుటుంబ కలయిక అనుకుంటాం, కానీ శారీరక, మానసిక అనుబంధాలు కూడా ముఖ్యమే. ఒక మిత్రుడు తన మేనల్లుడికి చేసిన పెళ్లి ఘనంగా జరిగింది. వధువు అందంగా ఉంది, వరుడు చదువుకున్నవాడు, ఉద్యోగం ఉన్నవాడు – అన్నీ బాగానే ఉన్నాయి. కానీ, కొన్ని రోజుల్లోనే విషయం బయటపడింది – అతనికి శారీరకంగా స్త్రీతో సహజంగా ఉండే సామర్థ్యం లేదు!

ఇది ఎంత పెద్ద విషయమో ఆ అమ్మాయి జీవితాన్ని ఊహించండి. మూడో రోజుకే విసిగిపోయి విడాకులు తీసుకున్నారు. ఆమె జీవితంలో కొత్త ఆశలు నాటుకోవాలంటే, సమాజం ఓపికగా ఆలోచించాలి. పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య బంధమే కాదు, కుటుంబాల మధ్యనూ బంధమే. కానీ, కొత్తగా వచ్చిన కోడలు మామూలుగా ఉన్నా, అత్తగారికి నచ్చదు. మా అబ్బాయి ఇంతవరకు టీ కూడా తాగలేదు అని చెప్పే వాళ్లు, కొడుకు చేతితో భార్య వంట చేతులు కాల్చినా అర్ధం చేసుకోరు. అలాగే, కొత్త అబ్బాయి సంపాదన రాదు, కానీ ఊహలు మాత్రం సూపర్‌ఫాస్ట్ రైలే! నీ డబ్బు నా డబ్బు అనే తేడాలు పెరిగితే, ఆ బంధం ఎంతకాలం నిలవగలదు? పెళ్లి అయ్యాక ఫోన్ ఎక్కువ పెట్టేస్తే, జీవితంలో హ్యాపీ మిస్సవ్వుతుంది. ఆన్లైన్ లో రిలేషన్ బాగా ఉంటుంది కానీ ఆఫ్‌లైన్ లో మాత్రం మౌనం. రోజూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెడితే, రిలేషన్ షిప్ గాడిలో పడుతుందనుకుంటే పొరపాటే!

why newly married couples are taking divorce

ఇగో – ఇది మామూలు మంట కాదు, బాగా అంటుకుంటే బంధాన్ని బూడిద చేస్తుంది. భార్య ఎక్కువ సంపాదిస్తే భర్త బాధపడతాడు, భర్త ముందుకెళ్తే భార్య అసహనం పడుతుంది. ప్రేమించే ముందు, మనసులు కలవాలా? స్వేచ్ఛతో పాటు బాధ్యత ఉండాలా? అనేదే అసలైన ప్రశ్న! ఒకరిని నమ్మి ప్రేమించి, చివరికి వదిలేయడం నేటి ట్రెండ్. పెళ్లి ముందు మాట్లాడిన మాటలు పెళ్లి తర్వాత మర్చిపోతే బంధం నిలబడగలదా? ప్రేమ వివాహాలు పెరిగినా, విడాకుల రేటు తగ్గడం లేదు. మన పెద్దవాళ్లకు ఇష్టం లేకుండా చేసుకున్న ప్రేమ వివాహాలు, వాళ్లు అనుకున్నట్టు నిజంగా తప్పా? లేక ప్రేమే ఉంటే, విడిపోవడం ఉండదా? భారతదేశంలో విడాకుల రేటు ఇప్పటికీ తక్కువే – 1% లోపే. కానీ, పట్టణాల్లో విడిపోతున్న జంటల సంఖ్య పెరుగుతోంది.

2011 జనగణన ప్రకారం, విడిపోయిన వ్యక్తుల రేటు 0.29%. కానీ ఇప్పుడు, సోషల్ మీడియా, ఆధునిక జీవనశైలి కారణంగా ఈ సంఖ్య పెరిగింది. ప్రతి 100 వివాహాల్లో 5-7 విడాకులు పట్టణ ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. ప్రేమ, నమ్మకం, ఓర్పు – ఇవి లేకుండా పెళ్లి చేయించడమే గానీ, బంధాన్ని నిలబెట్టడం కష్టమవుతోంది. కొత్తగా పెళ్లయిన వారు మొదటి కొన్ని రోజుల్లోనే విబేధాలు పెంచుకుంటున్నారు. దీని కోసం కుటుంబాలు, వ్యక్తిగత పరిణామాలు, సమాజం కలిసి చర్చించాలి. పెళ్లి చేయడం కంటే, పెళ్లిని నిలబెట్టడం కష్టమే! ఇది నిజం. మరి ఈ నూతన సమాజంలో పెళ్లి బంధం ఎంతకాలం నిలుస్తుందో?

Admin

Recent Posts