ప్ర‌శ్న - స‌మాధానం

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఉప‌వాసం చేయ‌వ‌చ్చా..?

డయాబెటీస్ రోగులు ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. ఒకే సారి అధికంగా తినరాదు. లేదా పూర్తిగా ఖాళీ పొట్టతో కూడా వుండరాదు. సాధారణంగా ప్రతి మతంలోను కొన్ని పవిత్ర దినాలలో మతపర వ్యక్తులు ఉపవాసాలు ఆచరిస్తారు. మీరు డయాబెటీస్ రోగులైతే, మీకుగల పరిస్ధితి మీరే అంచనా వేసుకోవాలి.

మీ బ్లడ్ షుగర్ తక్కువస్ధాయికి పడకుండా చూడాలి. దానికిగాను మీరు మీ బ్లడ్ షుగర్ లెవెల్ ఉపవాసంవున్నపుడు సరిచూచుకుంటూ వుండండి. మీరు ఇన్సులిన్ తీసుకునేవారైతే, ఉపవాసం వున్న రోజుకు అంటే సమయాన్ని బట్టి. తక్కువ డోసేజీ ఇన్సులిన్ తీసుకోవాలి. మీరు షుగర్ వ్యాధి టాబ్లెట్లు వాడేవారైతే, టాబ్లెట్ ను ఆరోజుకు వేయకపోవడం మంచిది.

can diabetics do fasting

ఉపవాసం ఉన్న రోజు టాబ్లెట్ వేసినట్లయితే మీలో హైపో…అంటే లో షుగర్ ఏర్పడి శరీరం బలహీనపడటం, చెమటలు పట్టటం, చేతులు, కాళ్ళు వణకటం వంటి పరిస్ధితి ఏర్పడుతుంది. అట్టి పరిస్ధితిలో వెంటనే రోగికి కొంత ఆహారం, లేదా తక్షణమే శక్తినిచ్చే గ్లూకోజ్ వంటివి ఇచ్చి, షుగర్ స్ధాయిని నిలపాలి.

Admin

Recent Posts