హెల్త్ టిప్స్

మీరు ఈ ఆరోగ్య‌క‌ర‌మైన బ్రేక్ ఫాస్ట్‌ల‌ను తింటున్నారా.. లేదా..?

రోజు మొత్తంలో ఉదయంవేళ తీసుకునే బ్రేక్ ఫాస్ట్ ఆహారం చాలా ప్రాముఖ్యత కలిగివుంటుంది. చాలామంది బ్రేక్ ఫాస్ట్ మానేస్తే సన్నపడి ఆరోగ్యంగా వుంటారని భావిస్తారు. కాని అది సరికాదు. ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఉదయం వేళలో తింటే అది అధికబరువు నిరోధించటమే కాక తేలికగా సన్నబడేస్తుంది. కనుక బ్రేక్ ఫాస్ట్ లో ఏ రకమైన ఆహారాలు తీసుకోవాలో పరిశీలించండి. ముందుగా బ్రేక్ పాస్ట్ చేసేటందుకు ప్రతిరోజూ ఒక సమయం నిర్దేశించండి.

సరైన సమయాలలో తీసుకోకుంటే బరువు తగ్గే అవకాశాలు తగ్గుతాయి. బరువు తగ్గాలంటే, సన్నగా వుండాలంటే, ఓట్ మీల్స్ ఒక ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఆహారం కాగలదు. ఆరోగ్యమే కాక కడుపు నిండుతుంది. దీనితో పచ్చి కూరలు కూడా కలిపి వేడిగా తినవచ్చు. బ్రేక్ ఫాస్ట్ గా రెండు అరటిపండ్లు కడుపు నింపేస్తాయి. వెన్నతీసిన పాలు లేదా పండ్ల రసాలు కూడా వీటితో పాటు వుంటే కడుపు నిండటమే కాదు రోజంతా చురుకుదనం శక్తి కొనసాగుతాయి.

are you taking this healthy breakfast or not

ఉడికించిన గుడ్డు మరో ఆరోగ్యకరమైన ఆహారం. దీనిని రోస్టెడ్ బ్రెడ్ లేదా బ్రెడ్ టోస్ట్ తో కలిపి తీసుకుని ఒక గ్లాసెడు పండ్ల రసం తాగండి. ఆమ్లెట్ కంటే కూడా ఉడికించిన గుడ్డులో పోషకాలు బాగా వుంటాయి. కార్న్ ఫ్లేక్స్ (మొక్కజోన్న విత్తులు) బ్రేక్ ఫాస్ట్ గా బాగుంటుంది. చేయటం కూడా తేలిక. బరువు తేలికగా తగ్గిస్తాయి. పాలతో కలిపి తినవచ్చు. అరటిపండు, స్ట్రాబెర్రీ, ఆపిల్ వంటివి కూడా చేరిస్తే కడుపు నిండిపోతుంది. వెజిటబుల్ శాండ్ విచెస్ సాధారణంగా తింటారు. మంచి బ్రెడ్ లో ఉడికించిన వెజిటబుల్స్ లేదా తక్కువ కొవ్వుకల ఛీస్, బటర్ వంటివి పెట్టి తింటే బాగుంటుంది. ఈ ఆహారాలను ఉదయంవేళ మితంగా తినాలి. అధికంగా తింటే, జీర్ణ క్రియకే శక్తి అంతాపోయి మీలో బద్ధకం ఏర్పడుతుంది.

Admin

Recent Posts