షుగ‌ర్ ఉన్న‌వారు ద్రాక్ష పండ్ల‌ను తిన‌వ‌చ్చా ? తింటే ఏమ‌వుతుందో తెలుసా ?

ద్రాక్ష పండ్ల‌లో మ‌న‌కు భిన్న ర‌కాల రంగుల‌కు చెందిన ద్రాక్ష‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి రుచి ప‌రంగా కొన్ని తేడాల‌ను క‌లిగి ఉంటాయి. అయితే అన్ని ర‌కాల ద్రాక్ష పండ్ల‌ను ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటుంటారు. ద్రాక్ష ర‌సాన్ని కూడా ఎక్కువ‌గానే తాగుతుంటారు. మ‌రి షుగ‌ర్ ఉన్న‌వారు ద్రాక్ష పండ్ల‌ను తిన‌వ‌చ్చా ? తింటే ఏమ‌వుతుంది ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

షుగ‌ర్ ఉన్న‌వారు ద్రాక్ష పండ్ల‌ను తిన‌వ‌చ్చా ? తింటే ఏమ‌వుతుందో తెలుసా ?

యూనివ‌ర్సిటీ ఆఫ్ మిషిగ‌న్‌కు చెందిన సైంటిస్టులు చెబుతున్న ప్ర‌కారం ద్రాక్ష పండ్ల‌ను షుగ‌ర్ ఉన్న‌వారు తిన‌వ‌చ్చు. ఇవి వారికి ఆరోగ్య‌క‌ర‌మైనవే. మేలు కూడా చేస్తాయి. అందువ‌ల్ల వారు సూచిస్తున్న ప్ర‌కారం ద్రాక్ష పండ్ల‌ను షుగ‌ర్ ఉన్న‌వారు తిన‌వ‌చ్చు.

ద్రాక్ష పండ్ల‌లో కార్బొహైడ్రేట్లు ఉన్న‌ప్ప‌టికీ అవి త‌క్కువ‌గానే ఉంటాయి. ద్రాక్ష పండ్ల‌కు చెందిన గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ 46. నిపుణులు చెబుతున్న ప్ర‌కారం జీఐ విలువ 55 అంత‌క‌న్నా త‌క్కువ ఉన్న ఆహారాల‌ను షుగ‌ర్ ఉన్న‌వారు నిర్భ‌యంగా తిన‌వ‌చ్చు. అందువల్ల ద్రాక్ష పండ్ల జీఐ విలువ 55 క‌న్నా త‌క్కువే క‌నుక వాటిని షుగ‌ర్ ఉన్న‌వారు తిన‌వ‌చ్చు. ఇందులో భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు.

జీఐ విలువ త‌క్కువ‌గా ఉన్న ఆహారాల‌ను తింటే మ‌న శ‌రీరంలో షుగ‌ర్ స్థాయిలు అంత త్వ‌ర‌గా పెర‌గ‌వ‌ని అర్థం. అందువ‌ల్ల జీఐ విలువ త‌క్కువ‌గా ఉన్న వాటిని షుగ‌ర్ ఉన్న‌వారు తినాలి. ఆ జాబితాలో ద్రాక్ష పండ్లు కూడా ఒక‌టి. క‌నుక వాటిని వారు నిర‌భ్యంత‌రంగా తిన‌వ‌చ్చు.

ఇక ద్రాక్ష పండ్ల‌లో ఆకుప‌చ్చ కాకుండా న‌లుపు లేదా ఎరుపు రంగుల‌కు చెందిన ద్రాక్ష పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి క‌ణాల‌ను సుర‌క్షితంగా ఉంచుతాయి. అంతేకాదు షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గించ‌డంలో స‌హాయం చేస్తాయి. క‌నుక ఆకుప‌చ్చ కాకుండా మిగిలిన రెండు ర‌కాల రంగుల‌కు చెందిన ద్రాక్ష పండ్ల‌ను.. అంటే న‌లుపు, ఎరుపు ద్రాక్ష పండ్ల‌ను షుగ‌ర్ ఉన్న‌వారు ఎలాంటి అభ్యంత‌రం లేకుండా తిన‌వ‌చ్చు. దీంతో గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

Share
Admin

Recent Posts