Bananas : అరటి పండ్లను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అరటి పండ్లలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే అరటి పండ్లు శక్తినిస్తాయి. కనుక శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు, క్రీడాకారులు, వ్యాయామం ఎక్కువగా చేసేవారు అరటి పండ్లను తింటుండాలి. దీంతో శక్తి త్వరగా లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు.
అయితే పురాతన కాలం నుంచి మనలో చాలా మందికి ఓ నమ్మకం ఉంది. అదేమిటంటే.. జంట అరటి పండ్లను తింటే.. కవలలు పుడతారా ? అని.. కానీ ఇందులో నిజం లేదు. మన పెద్దలు జంట అరటి పండ్లను తింటే కవలలు పుడతారని చెబుతారు. అది పూర్తిగా యాదృచ్ఛికమే. కానీ కవల అరటి పండ్లను తినడం వల్ల కవలలు పుట్టరు. సైన్స్ పరంగా ఇది ఎక్కడా నిరూపితం కాలేదు.
ఇక మనలో చాలా మందికి ఉండే ఇంకో నమ్మకం.. జంట అరటి పండ్లను గర్భిణీలను తినకూడదా ? అని.. తినవచ్చు. కానీ ఒక రోజుకు జంట అరటి పండ్లను తింటే.. ఇంక మళ్లీ అరటి పండ్లను మరుసటి రోజే తినాలి. మళ్లీ ఆ పండ్లను ఆ రోజు ఇంకా ఎక్కువ మొత్తంలో తినరాదు.
ఎందుకంటే.. ఒక మీడియం సైజు అరటి పండులో రోజులో మనకు కావల్సిన పొటాషియంలో దాదాపుగా 20 నుంచి 30 శాతం వరకు పొటాషియం లభిస్తుంది. అదే 2 అరటి పండ్లు అయితే 60 నుంచి 70 శాతం వరకు పొటాషియం అందుతుంది. ఇక మనం తినే ఆహారాల ద్వారా కూడా పొటాషియం లభిస్తుంది. ఈ క్రమంలో శరీరంలో పొటాషియం అధికం అయితే కిడ్నీలపై భారం పడుతుంది. కనుక గర్భిణీలు రోజుకు 2 కు మించకుండా అరటి పండ్లను తినాలి. ఇదంతా.. తలనొప్పి ఎందుకని చెప్పి మన పెద్దలు అసలు జంట అరటి పండ్లనే తినొద్దని గర్భిణీలకు చెబుతూ వచ్చారు. ఇదీ.. అసలు విషయం. అంతేకానీ.. వాటిని తినకూడదని కాదు. కాకపోతే మోతాదులో తినాల్సి ఉంటుంది.