Onion Juice : ఉల్లిపాయలు లేకుండా ఎవరైనా సరే కూరలు చేయరు. రోజూ మనం ఉల్లిపాయలను కూరల్లో వేస్తుంటాం. దీని వల్ల కూరలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అలాగే చాలా మంది పచ్చి ఉల్లిపాయలను కూడా తింటుంటారు. ముఖ్యంగా మసాలా కూరలు, చపాతీలు, రోటీలు, నాన్ వెంజ్ వంటకాలను తినేటప్పుడు పచ్చి ఉల్లిపాయలను నేరుగా అలాగే తింటుంటారు. అయితే ఉల్లిపాయలను తినడం వల్ల మాత్రమే కాదు.. ఉల్లిపాయల రసాన్ని వాడడం వల్ల కూడా మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వాటిల్లో జుట్టు సమస్య కూడా ఒకటి. ఉల్లిపాయల రసాన్ని వాడితే జుట్టు పెరగడంతోపాటు జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే ఉల్లిపాయలతో నిజంగానే జుట్టును పెరిగేలా చేయవచ్చా.. ఇందులో నిజం ఎంత ఉంది.. ఆయుర్వేదం ఏమని చెబుతోంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయలను ఆయుర్వేద ప్రకారం ఉగ్ర తత్వం ఉన్న ఆహారంగా చెబుతారు. అంటే వీటిని తింటే శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. దీంతో శరీర భాగాలకు ఆక్సిజన్, పోషకాలు సరిగ్గా అందుతాయి. అలాగే జుట్టుకు కూడా ఇవి అందుతాయి. దీంతో జుట్టు పెరుగుతుంది. అలాగే ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. కనుక ఉల్లిపాయలను వాడడం వల్ల జుట్టు పెరుగుతుంది. ఉల్లిరసంతో జుట్టును పెంచుకోవడంతోపాటు జుట్టు సమస్యలు లేకుండా చేసుకోవచ్చు. ఈ విషయాలను ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అయితే జుట్టు సమస్యలు పోయి జుట్టు పెరగాలంటే.. అందుకు ఉల్లిపాయలను ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయలను మనం అనేక రకాలుగా వాడుకోవచ్చు. ఎలా వాడినా సరే జుట్టు సమస్యలు పోతాయి. జుట్టు పెరుగుతుంది. శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. ఇక జుట్టు ఆరోగ్యం కోసం ఉల్లిపాయలను ఎలా వాడాలంటే.. ఉల్లిపాయను ఒకదాన్ని తీసుకుని దంచి రసం తీయాలి. ఇలా తీసిన రసాన్ని జుట్టుకు బాగా రాయాలి. జుట్టు కుదుళ్లకు తగిలేలా 5 నిమిషాల పాటు ఈ రసాన్ని బాగా మర్దనా చేయాలి. తరువాత 15 నిమిషాల పాటు జుట్టును అలాగే ఉంచాలి. అనంతరం హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారంలో కనీసం 2 సార్లు చేయాలి. దీంతో ఉల్లిపాయల్లో ఉండే పోషకాలు, సల్ఫర్, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు సమస్యలను తగ్గిస్తాయి. ముఖ్యంగా చుండ్రు పోతుంది. అలాగే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. దీంతో జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. అలాగే జుట్టు పెరుగుతుంది. ఇలా ఉల్లిపాయ రసంతో జుట్టును పెంచుకోవచ్చు.
ఇక ఉల్లిపాయ రసాన్ని 2 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకుని దానికి అంతే మోతాదులో కొబ్బరినూనె కలిపి అందులో 5 చుక్కల టీ ట్రీ ఆయిల్ వేయాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని బాగా కలిపి జుట్టుకు రాయాలి. 1 గంట సేపయ్యాక తలస్నానం చేయాలి. ఇలా వారంలో 2 సార్లు చేసినా చాలు.. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. శిరోజాలు వేగంగా పెరుగుతాయి. అలాగే ఉల్లిపాయ రసంలో ఆలివ్ నూనె కలిపి కూడా వాడుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్ల ఉల్లిరసంలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె కలిపి మిశ్రమంగా చేయాలి. దీన్ని తలకు పట్టించాలి. 2 గంటల తరువాత హెర్బల్ షాంపూతో తలస్నాం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే జుట్టు సమస్యలు పోతాయి. శిరోజాలు కాంతివంతంగా మారుతాయి. జుట్టు పెరుగుతుంది కూడా.
అలాగే ఉల్లిరసంలో ఆముదం కలిపి వాడుకోవచ్చు. ఇందుకు గాను రెండింటినీ 2 టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకుని బాగా కలిపి తలకు పట్టించాలి. 1 గంట అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయాలి. అలాగే 1 కోడిగుడ్డులోని రెండు సొనలను పూర్తిగా తీసి అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఉల్లిరసం కలిపి, అందులోనే 3 చుక్కల లావెండర్ నూనె వేసి మళ్లీ కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేశాక షవర్ క్యాప్ పెట్టి 30 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత తలస్నానం చేయాలి. అయితే తప్పనిసరిగా చన్నీళ్లతోనే స్నానం చేయాలి. లేదంటే కోడిగుడ్డులోని పోషకాలు జుట్టుకు లభించవు. ఇలా చేశాక తలను ఆరబెట్టాలి. ఇలా వారంలో 2 సార్లు చేస్తే తప్పక ఫలితం ఉంటుంది. జుట్టు సమస్యలు పోతాయి. ముఖ్యంగా చుండ్రు తగ్గుతుంది. అలాగే జుట్టు చివర్లు చిట్లిపోకుండా ఉంటాయి. జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. ఒత్తుగా పెరుగుతుంది. ఇలా ఉల్లిపాయలను పలు రకాలుగా ఉపయోగించడం వల్ల శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీంతో జుట్టు వద్దన్నా సరే పెరుగుతూనే ఉంటుంది.