ప్రెషర్ కుక్కర్ అనేది దాదాపుగా ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ఇందులో ఆహార పదార్థాలను చాలా త్వరగా ఉడికించవచ్చు. ఆహారాన్ని చాలా త్వరగా వండుకోవచ్చు. ఎంతో గ్యాస్ ఆదా అవుతుంది. అయితే ప్రెషర్ కుక్కర్ వల్ల లాభం ఉన్నప్పటికీ అందులో వండిన ఆహారాలను తినవచ్చా ? ఆరోగ్యంపై ఏమైనా ప్రభావం పడుతుందా ? అని కొందరు సందేహిస్తుంటారు. మరి అందుకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
ప్రెషర్ కుక్కర్‌లో ఆహారం వండడం అనేది ఆవిరితో ఉడికించడం కిందకు వస్తుంది. సాధారణ కుకింగ్ కాదు. ఇడ్లీలను మనం ఏవిధంగా అయితే ఆవిరి ద్వారా ఉడికిస్తామో ప్రెషర్ కుక్కర్ కూడా ఆహారాలను అలాగే ఉడకబెడుతుంది. ఆవిరి ద్వారా ఉడికించడం అనేది అత్యంత ఆరోగ్యకరమైన పద్ధతుల్లో ఒకటి. అందువల్ల ప్రెషర్ కుక్కర్‌లో వండిన ఆహారాన్ని నిరభ్యంతరంగా తినవచ్చు. ఏమీ కాదు. ఆవిరి ద్వారా పదార్థాలు ఉడుకుతాయి, కనుక వాటిని తింటే ఏమీ కాదు, ఆరోగ్యకరమైన ప్రయోజనాలనే పొందుతారు.
అయితే మరి ప్రెషర్ కుక్కర్‌లో అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద పదార్థాలు ఉడుకుతాయి కదా కనుక వాటిల్లో ఉండే పోషకాలు నశిస్తాయా ? అంటే కాదు, ఎందుకంటే సాధారణ వంటతో అయితే ఎక్కువ సేపు ఉడకబెట్టాల్సి ఉంటుంది. అలాంటప్పుడు పోషకాలు నశిస్తాయి. కానీ ప్రెషర్ కుక్కర్‌లో చాలా తక్కువ సమయం పాటు ఉడికించినా చాలు, పదార్థాలు ఉడుకుతాయి. పదార్థాలు ఉడికేందుకు కుక్కర్‌లో అయితే తక్కువ సమయం పడుతుంది. కనుక అంత తక్కువ సమయంలో ఆ పదార్థాల్లో ఉండే పోషకాలు నశించవు. ఎక్కువ సమయం పాటు ఉడికిస్తేనే పోషకాలు నశిస్తాయి. కనుక కుక్కర్‌లో ఉడికించిన పదార్థాల్లో పోషకాలు నశిస్తాయని అనుకోకూడదు. పోషకాలు అలాగే ఉంటాయి. కాబట్టి కుక్కర్‌లో ఉడకబెట్టిన పదార్థాలను నిరభ్యంతరంగా తినవచ్చు. అందులో ఎలాంటి సందేహాలకు అవకాశం లేదు.
కుక్కర్‌లో ఆహారాలను ఉడికించడం వల్ల సమయం ఆదా అవడమే కాదు, ఎంతో విలువైన ఇంధనాన్ని ఆదా చేయవచ్చు. అలాగే కూరగాయల్లో ఉండే క్రిమి సంహారక మందుల అవశేషాలు నశిస్తాయి. వాటిపై ఉండే సూక్ష్మ జీవులు కూడా నశిస్తాయి. దీంతో కుక్కర్‌లో ఉడకబెట్టబడిన ఆహారం ఆరోగ్యంగా మారుతుంది. కనుక ప్రెషర్ కుక్కర్‌లలో వండే ఆహారం ఆరోగ్యకరమైందే అని చెప్పవచ్చు. దాంతో మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడదు.