Egg : చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తినడానికి అందరూ ఆసక్తి చూపించే వాటిల్లో కోడిగుడ్డు కూడా ఒకటి. కోడిగుడ్డును ఉడికించినా లేదా ఎటువంటి వంటకం చేసినా తినడానికి అందరూ ఇష్టపడతారు. గుడ్డులో ఉండే విటమిన్స్, మినరల్స్ అన్నీ ఇన్నీ కావు. గుడ్డును తినమని కూడా వైద్యులు మనకు సూచిస్తూ ఉంటారు. ప్రభుత్వం కూడా రోజూ గుడ్డు తినండి ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి అని టీవీల్లో, పత్రికల్లో ప్రకటనలు కూడా ఇస్తూ ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారంగా గుడ్డు మారిపోయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
అయితే చాలా మంది గుడ్డును తింటున్నప్పటికీ దీనిలో తెల్ల సొనను తినాలా, పచ్చ సొనను తినాలా అని సందేహపడుతుంటారు. అసలు గుడ్డు గురించి న్యూట్రిషియన్స్ ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్డును పోషకాల గని అని చెబుతుంటారు. పిల్లల ఎదుగుదలకు గుడ్డు ఎంతగానో ఉపయోగపడుతుందని.. దీనిని ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. గుడ్డులో ఉండే తెల్ల సొనలో అనేక రకాల విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అధిక సంఖ్యలో ఉంటాయి. అన్ని శాకాహార, మాంసాహార పదార్థాల కన్నా గుడ్డులోని తెల్లసొన ఉత్తమమైనది.
ఒక గుడ్డులోని తెల్ల సొనను తింటే 70 క్యాలరీల శక్తి లభిస్తుంది. ప్రతిరోజూ గుడ్డు తెల్లసొనను తినడం వల్ల బరువు తగ్గుతారు. కంటి చూపు మెరుగుపడుతుంది. నరాల శక్తి పెరుగుతుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. ఇక గుడ్డులోని పచ్చసొనను ఇంగ్లిష్ లో ఎగ్ యాల్క్ అంటారు. దీనిలో కూడా ప్రోటీన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ అధికంగా ఉంటాయి. పచ్చసొనను తినడం వల్ల శక్తి లభిస్తుంది. తెల్ల సొనతో పోల్చితే పచ్చసొన వల్ల ఉపయోగాలు తక్కువగా ఉంటాయి.
అయినప్పటికీ దీనిని కూడా తప్పకుండా ఆహారంగా తీసుకోవాలి. పచ్చసొనను తినడం వల్ల కూడా మన శరీరానికి పోషకాలు లభిస్తాయి. కనుక గుడ్డులోని తెల్లసొనతో పాటు పచ్చసొను కూడా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గుడ్డులోని పచ్చసొనను తిన్నా తినకపోయినా తెల్లసొనను మాత్రం తప్పకుండా తినాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.