యాపిల్‌ పండ్లను రోజులో ఏ సమయంలో తింటే మంచిది ?

రోజూ ఒక యాపిల్‌ పండును తింటే డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదని చెబుతుంటారు. ఎందుకంటే యాపిల్‌ పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అనారోగ్య సమస్యలను రాకుండా చూస్తాయి. అందుకనే యాపిల్‌ పండ్లను తింటే డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సిన పని ఉండదని చెబుతుంటారు. యాపిల్‌ పండ్లను తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అధిక బరువు తగ్గడం దగర్నుంచి జీర్ణ సమస్యల వరకు యాపిల్‌ పండ్లు అనేక అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. అయితే ఈ పండ్లను ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. ఆయుర్వేద ప్రకారం యాపిల్‌ పండ్లను రోజులో నిర్దిష్టమైన సమయంలో మాత్రమే తినాలి. మరి రోజులో ఏయే సమయాల్లో యాపిల్‌ పండ్లను తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందామా..!

what is the best time to eat apple what is the best time to eat apple

ఆయుర్వేద ప్రకారం యాపిల్‌ పండ్లను పరగడుపున అస్సలు తినరాదు. తింటే మలబద్దకం, గ్యాస్‌ సమస్యలు వస్తాయి. యాపిల్‌ పండ్లను ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన తరువాత 1 గంట విరామం ఇచ్చి తినవచ్చు. లేదా మధ్యాహ్నం భోజనం చేశాక 1 గంట విరామం ఇచ్చి తినవచ్చు. యాపిల్‌ పండులో ఫైబర్‌ ఉంటుంది. అందువల్ల బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన గంట తరువాత తింటే సులభంగా జీర్ణమవుతుంది. అందులో ఉండే పోషకాలను శరీరం సులభంగా గ్రహిస్తుంది.

సాయంత్రం జీర్ణ రసాలు తక్కువగా ఉత్పత్తి అవుతాయి. జీర్ణశక్తి నెమ్మదిస్తుంది. అందువల్ల సాయంత్రం యాపిల్‌ పండును తినరాదు. అంతగా తినదలిస్తే సాయంత్రం 6 లోపే ఆ పండ్లను తినాలి. లేదంటే జీర్ణ సమస్యలు వస్తాయి. నిద్ర సరిగ్గా పట్టదు.

యాపిల్‌ పండ్లలో పెక్టిన్‌ ఉంటుంది. ఇది పెద్ద పేగులో ఆరోగ్యకరమైన బాక్టీరియా పెరుగుదలకు దోహదం చేస్తుంది. దీంతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో ఉండే విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ ప్రయోజనాలను పొందాలంటే యాపిల్‌ పండ్లను ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ చేశాక ఒక గంట ఆగి తింటే మంచిది.

యాపిల్‌ పండ్లను ఓట్‌మీల్‌లో ముక్కలుగా కలిపి తినవచ్చు. యాపిల్‌ పండ్లను జ్యూస్‌లా చేసుకుని తీసుకోవచ్చు. కాకపోతే అందులో చక్కెర కలపకుండా తేనె కలుపుకోవచ్చు. ఇక యాపిల్‌ పండ్లను పొట్టు తీయకుండానే తినాలి. ఎందుకంటే పొట్టులో అనేక పోషకాలు ఉంటాయి. పొట్టు తీస్తే ఆ పోషకాలన్నింటినీ నష్టపోతాం. అందువల్ల యాపిల్‌ పండ్లను పొట్టుతోనే తినాలి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts