ప్ర‌శ్న - స‌మాధానం

పండ్లను తినేందుకు సరైన సమయం ఏది ? రోజులో పండ్లను ఎప్పుడు తింటే మంచిది ?

సీజనల్‌గా లభించే పండ్లతోపాటు ఏడాది పొడవునా మనకు అందుబాటులో ఉండే పండ్లను తీసుకోవడం వల్ల మనకు అనేక పోషకాలు లభిస్తాయి. శక్తి అందుతుంది. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. పలు అనారోగ్య సమస్యలను రాకుండా అడ్డుకోవచ్చు. అయితే పండ్లను తినే విషయంలో చాలా మందికి అనుమానాలు, సందేహాలు వస్తుంటాయి. పండ్లను రోజులో ఏ సమయంలో తినాలి ? అని సందేహ పడుతుంటారు. అలాంటి వారు ఈ వివరాలను తెలుసుకోండి.

what is the best time to eat fruits

1. ఉదయం సమయంలో పండ్లను తినవచ్చు. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య పండ్లను తినాలి. ఉదయం 10 గంటలు దాటితే పండ్లను తినరాదు. ఉదయం నిద్ర లేవగానే 30 నిమిషాల్లోపు పండ్లను తింటే మంచిది. తరువాత బ్రేక్‌ ఫాస్ట్‌ చేయాలి.

2. లంచ్‌ సమయంలో మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల మధ్య పండ్లను తినాలి. సాయంత్రం 4 దాటితే పండ్లను తినరాదు. లంచ్‌కు, బ్రేక్‌ఫాస్ట్‌కు మధ్య కనీసం 4 గంటల వ్యవధి ఉండాలి.

3. రాత్రి భోజనం సమయంలోనూ పండ్లను తినవచ్చు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల లోపు పండ్లను తినాలి. రాత్రి 10 గంటలు దాటాక పండ్లను తినరాదు. రాత్రి నిద్రకు, భోజనానికి మధ్య కనీసం 3 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.

ఇక బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ ఏ సమయంలో పండ్లను తిన్నా పండ్లను తినేందుకు, భోజనానికి మధ్య కనీసం 30 నిమిషాల గ్యాప్‌ ఉండేలా చూసుకోవాలి. దీంతో పండ్లలోని పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts