వయసు వచ్చే కొద్దీ సాధారణంగా టైప్ 2 డయాబెటీస్ కు గురవుతున్నారు. దీనికి కారణం శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవటమే. ఇన్సులిన్ సరఫరా తగ్గితే రక్తంలో షుగర్ నిల్వలు పెరిగి డయాబెటీస్ గా చెప్పచ్చు. ఇక లక్షణాలు, అలసట, చూపు మందగించటం, గాయాలు త్వరగా తగ్గకపోవటం జరుగుతుంది. షుగర్ వ్యాధికి ఆహార ప్రభావం బాగా వుంటుంది. దాల్చిన చెక్కను వివిధ రకాలుగా తినటం ద్వారా షుగర్ వ్యాధిని తగ్గించవచ్చని పరివోధనలో తేలింది.
దాల్చిన చెక్క శరీరంలో ఇన్సులిన్ ప్రభావాలను చూపుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ వుండి ప్రొటీన్ స్దాయి పెంచుతాయి. ప్రొటీన్లు శరీరంలో గ్లూకోజు రవాణా తేలిక చేస్తాయి. పరిశోధనలో దాల్చిన చెక్కను కొంతమంది డయాబెటీస్ రోగులకు 40 రోజులపాటు ఇవ్వగా, 20 రోజులు దాటిన తర్వాత వారిలో ఇన్సులిన్ స్ధాయి పెరిగినట్లు కనుగొన్నారు.
కనుక డయాబెటిస్ ఉన్నవారు తమ రోజువారి ఆహారంలో దాల్చిన చెక్కను తీసుకోవాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. దాల్చిన చెక్కను నేరుగా తినలేరు. ఘాటుగా ఉంటుంది. కనుక దీని పొడిని మీరు తినే ఆహారాలపై చల్లి తినవచ్చు. లేదా దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను రోజుకు 2 పూటలా తాగుతుండాలి. అలాగే దాల్చిన చెక్కకు సంబంధించిన సప్లిమెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి కనుక డాక్టర్ సూచన మేరకు వాటిని కూడా వాడుకోవచ్చు. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.