డయాబెటిస్ ఉన్నవారు తమ షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుకోవడం నిజంగా కష్టమే. అందుకు చాలా శ్రమించాల్సి ఉంటుంది. డైట్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వేళకు తిండి తినాలి, నిద్ర పోవాలి. వ్యాయామం చేయాలి. ఇలా రోజూ చేస్తేనే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. దీని వల్ల ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా నివారించవచ్చు. అయితే రోజూ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌లో పాలను తాగడం వల్ల షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చు. ఈ విషయాన్ని సైంటిస్టులు చెబుతున్నారు.
సైంటిస్టులు చేపట్టిన అధ్యయనం ప్రకారం, ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో పాలు తాగడం వల్ల రోజంతా గ్లూకోజ్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయని వెల్లడైంది. 2018లో డెయిరీ సైన్స్ అనే జర్నల్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం.. బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా పాలను తీసుకుంటే రోజంతా షుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నట్లు నిర్దారించారు.
ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా పాలను తాగే వారి వివరాలను సైంటిస్టులు సేకరించి వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో పై వివరాలను వెల్లడించారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో పాలను తాగిన వారిలో 2 గంటల తరువాత పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను చెక్ చేయగా.. ఆ స్థాయిలు తగ్గాయని గుర్తించారు. పాలను తాగని వారిలో షుగర్ లెవల్స్ తగ్గలేదని నిర్దారించారు.
పాలలో కేసీన్ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి గ్యాస్ట్రిక్ హార్మోన్లను విడుదల చేస్తాయి. దీని వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. ఫలితంగా కడుపు నిండిన భావన కలుగుతుంది. జీర్ణక్రియ నెమ్మదిగా జరగడం వల్ల షుగర్ లెవల్స్ కూడా అమాంతం పెరగవు. నెమ్మదిగా పెరుగుతాయి. కనుక షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.
ఇక ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో పాలను తాగిన తరువాత మధ్యాహ్నం లంచ్ చేశాక కూడా గ్లూకోజ్ లెవల్స్ తగ్గే ఉన్నాయని గుర్తించారు. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా పాలను తాగాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. దీంతో కార్బొహైడ్రేట్లు నెమ్మదిగా జీర్ణమవుతాయి. రోజంతా షుగర్ లెవల్స్ తగ్గి ఉంటాయి.
డయాబెటిస్ సమస్య ఉన్నవారు పాలను తాగరాదేమోనని అపోహలకు గురవుతుంటారు. కానీ నిజానికి పాలు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి. పాలలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా పాలలో ఉండే మినరల్స్ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అందువల్ల పాలను తాగితే ప్రయోజనం కలుగుతుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు పాలలో చక్కెరకు బదులుగా తేనె లేదా బెల్లం కలిపి తాగితే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365