మ‌ద్యం సేవించ‌డం మంచిదే.. కానీ అందుకు లిమిట్ ఉంటుంది.. అది ఎంతో తెలుసుకోండి..!!

మ‌ద్యం సేవించడం ఆరోగ్యానికి హానిక‌రం. కానీ మ‌ద్యాన్ని స్వ‌ల్ప మోతాదులో సేవిస్తే లాభాలు పొంద‌వ‌చ్చు. ఇదీ.. వైద్యులు చెప్పేమాట‌. మ‌ద్యం విప‌రీతంగా సేవిస్తే తీవ్ర‌మైన న‌ష్టాలు క‌లుగుతాయి. కానీ తాగాల్సిన మోతాదులో తాగితే మ‌ద్యం వ‌ల్ల ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి.

మ‌ద్యం సేవించ‌డం మంచిదే.. కానీ అందుకు లిమిట్ ఉంటుంది.. అది ఎంతో తెలుసుకోండి..!!

రోజుకు 2, 3 డ్రింక్స్ తాగేవారికి క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అదే వారంలో 2, 3 డ్రింక్స్ తాగేవారికి క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. అంటే మ‌ద్యాన్ని త‌క్కువ‌గా సేవిస్తే దాంతో ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌ని రుజువ‌వుతోంది. ఈ వివ‌రాల‌ను పీఎల్‌వోఎస్ మెడిసిన్ అనే జ‌ర్న‌ల్‌లో ప్రచురించారు.

వారంలో 2 లేదా 3 డ్రింక్స్‌.. అంటే 2 రోజుల‌కు ఒక‌సారి 1 లేదా 2 పెగ్స్ తీసుకుంటే దాంతో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. 500 ఎంఎల్ బీర్ లేదా 2 గ్లాసుల వైన్ లేదా 1, 2 పెగ్స్.. వీటిని వారం మొత్తం మీద తీసుకోవాలి. కానీ రోజూ తీసుకోకూడ‌దు. రోజూ తీసుకుంటే నష్టం క‌లుగుతుంది. వారం మొత్తం మీద తీసుకుంటే క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. అందువ‌ల్ల మ‌ద్యాన్ని త‌క్కువ‌గా సేవిస్తే లాభాలు పొంద‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డంతోపాటు, ఎముక‌లు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి. డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. 2015లో బేయ్‌ల‌ర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ చేసిన రీసెర్చిలో ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. అయితే ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి క‌దా అని చెప్పి రోజూ మ‌ద్యం సేవించ‌వ‌ద్దు. వారంలో 1, 2 సార్లు అయితే ఓకే. రోజూ తాగితే న‌ష్ట‌మే క‌లుగుతుంది.

Share
Admin

Recent Posts