Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

Tathastu Devathalu : మ‌నం ఏవైనా మ‌న గురించి మ‌నం చెడుగా అనుకుంటే.. అలా అనొద్ద‌ని.. పైన త‌థాస్తు దేవ‌త‌లు తిరుగుతూ ఉంటార‌ని.. వారు త‌థాస్తు అంటే.. మ‌న‌కు అంతా చెడే జ‌రుగుతుంద‌ని.. క‌నుక వారు తిరిగే స‌మ‌యంలో మ‌నం చెడుగా ఏమీ మాట్లాడుకోకూడ‌ద‌ని.. పెద్ద‌లు చెబుతుంటారు. అయితే ఇంత‌కీ త‌థాస్తు దేవ‌త‌లు ఎవ‌రు.. వారు ఏ స‌మ‌యంలో తిరుగుతారు.. వారి క‌థేమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌న పురాణాల ప్ర‌కారం త‌థాస్తు దేవ‌త‌లు ఉంటారు. త‌థ‌ అంటే అప్ర‌కారంగా అస్తు అంటే జ‌ర‌గాల్సిందే అని అర్థం. మ‌నిషి ఏదైనా అన‌రాని మాటను ప‌దే ప‌దే అంటే త‌థాస్తు దేవ‌త‌లు వెంట‌నే త‌థాస్తు అంటారు. ఇలా త‌థాస్తు అనే వారినే త‌థాస్తు దేవ‌త‌లు అని అంటారు. సూర్యుని భార్య అయిన సంధ్యా దేవి సూర్యుని వేడిని భ‌రించ‌లేక గుర్రం రూపాన్ని దాల్చి కురు దేశం వెళ్తుంది. గుర్రం రూపంలో ఉన్న సంధ్యా దేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యా దేవి ద‌గ్గ‌ర‌కు వెళ్తాడు. ఇలా వీరిద్ద‌రి క‌ల‌యిక వల్ల పుట్టిన వారే అశ్వినీ కుమారులు. వీరినే త‌థాస్తు దేవ‌త‌లని, దేవ‌తా వైద్యుల‌ని అంటారు.

who are Tathastu Devathalu when they will roam
Tathastu Devathalu

వీరు ఎంతో వేగంగా ప్ర‌యాణిస్తూ ఉంటారు. వీరు ప్ర‌యాణించే మార్గంలో త‌థాస్తు అనుకుంటూ, వేద మంత్రాల‌ను జ‌పిస్తూ ఉంటారు. య‌జ్ఞాలు, యాగాలు జ‌రిగే చోట వీరు ఎక్కువ‌గా సంచ‌రిస్తూ ఉంటారు. ఇత‌రుల మంచి కోరుకునే వారు ఎవ‌రైనా త‌థాస్తు అంటే అది క‌చ్చితంగా జ‌రుగుతుందట‌. అశ్వినీ కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని మ‌రో చేత్తో అభ‌య హ‌స్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారు. మ‌న గురించి మ‌నం ఏదైనా అనుకుంటే త‌థాస్తు దేవ‌త‌లు వెంట‌నే త‌థాస్తు అంటార‌ని.. వారు ఎక్కువ‌గా సంధ్యా స‌మ‌యంలో.. అంటే సాయంత్రం స‌మయంలో తిరుగుతూ ఉంటార‌ని న‌మ్ముతుంటారు.

అలాంటి స‌మ‌యంలో మ‌న ద‌గ్గ‌ర ధ‌నం లేదు అనుకుంటే లేకుండానే పోతుంద‌ట‌. మ‌న గురించి, ఇత‌రుల గురించి మంచిగా మాట్లాడుకోవాలి. ఇత‌రుల‌కు హాని చేయ‌కుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి ప‌నుల‌కు మాత్ర‌మే దేవ‌త‌లు త‌థాస్తు అంటార‌ట‌. ఎవ‌రైనా మ‌న‌కు అన్యాయం చేసిన‌ప్పుడు మ‌నం ప‌దే ప‌దే వారి గురించి మ‌నం మాట్లాడుకుంటూ ఉంటాం. త‌థాస్తు దేవ‌త‌లు ఈ మాట‌ల‌ను విని త‌థాస్తు అంటార‌ట‌. దీంతో మ‌న‌కు అన్యాయం చేసిన‌ వారి ప‌త‌నం ప్రారంభ‌మ‌వుతుంది. క‌నుక ఇత‌రుల గురించైనా లేదా మ‌న‌ గురించైనా మ‌నం చెడుగా మాట్లాడుకోకూడ‌దు. ఎప్పుడూ మంచిగానే మాట్లాడుకోవాలని పురాణాలు చెబుతున్నాయి.

D

Recent Posts