వైద్య విజ్ఞానం

ఇన్సులిన్ అంటే ఏమిటి..? డ‌యాబెటిస్ ఉన్న‌వారు తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

ఇన్సులిన్ అంటే ఏమిటి? అంటే.. పొట్టలో పాన్ క్రియాస్ అనే గ్రంధి నుండి ఉత్పత్తి అయే హార్మోన్ ఇన్సులిన్. మనం ఆహారం తిన్నపుడు పొట్టలోని ఆహారంలోగల గ్లూకోజు రక్తంలో ప్రవేశిస్తుంది. ఈ గ్లూకోజు శక్తి నివ్వాలంటే కణాలలోకి ప్రవేశించాలి. ఇన్సులిన్ గ్లూకోజును కణాలలోకి ప్రవేశింపజేస్తుంది. టైప్ 1 డయాబెటీస్ వున్న వారికి పాన్ క్రియాస్ గ్రంధి ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు. టైప్ 2 డయాబెటీస్ కు ఇన్సులిన్ సరిపడా వుండదు. కనుక ఇరువురికి ఇన్సులిన్ అవసరం వుంటుంది. ఇన్సులిన్ ఎలా పొందాలి? ఇన్సులిన్ ఒకప్పుడు చనిపోయిన జంతువుల పాన్ క్రియాస్ గ్రంధి నుండి సేకరించేవారు. ఇపుడు వాటితో సంబందం లేకుండా లేబరేటరీలలో తయారు చేస్తున్నారు.

కనుక ఇతర అంటు వ్యాధులు వచ్చే అవకాశం కూడా లేదు. ఏ రకం డయాబెటీస్ కు ఇన్సులిన్ కావాలి? టైప్ 1 డయాబెటీస్ వారికి జీవించాలంటే ఇన్సులిన్ కావలసిందే. టైప్ 2 డయాబెటీస్ వారికి కూడా గర్భవతులుగా వున్నపుడు సర్జరీలలోను, ఆహారం తినలేని పరిస్ధితి వచ్చినపుడు, టాబ్లెట్ లు పనిచేయనపుడు డయాబెటీస్ నియంత్రణకై ఇన్సులిన్ ఇస్తారు.

what is insulin who requires it

టాబ్లెట్ ల కంటే ఇన్సులిన్ మెరుగైనదా? మెరుగైనదే! ఇన్సులిన్ అధిక ప్రయోజనం ఇస్తుంది. ఇన్సులిన్ నేరుగా శరీరంలోకి తీసుకోవటం సహజం. టాబ్లెట్లు సహజమైనవి కావు. వ్యాధి మొదట్లోనే ఇన్సులిన్ తీసుకుంటే పాన్ క్రియాస్ గ్రంధిదీర్ఘకాలం పని చేస్తుంది. తన ఉత్పత్తిని అందిస్తుందని ఇటీవలి పరిశోధనలు తేల్చాయి. సమస్యల్లా, నేటికీ మనం ఇన్సులిన్ ఇంజెక్షన్ ద్వారా తీసుకోవాల్సిందే. ఏదో ఒకనాటికి ఇపుడు వచ్చే షుగర్ వ్యాధులకు టాబ్లెట్లు పని చేయని స్ధితి వస్తుంది. అపుడు అందరూ ఇక ఇన్సులిన్ పై ఆధారపడవలసిందే.

Admin

Recent Posts