vastu

తలుపు గడప మీద‌ ఎందుకు కూర్చోరాదు?

పిల్లలను పెద్దలు గడపపై కూర్చోనివ్వక పోతుండెను. కాస్త పెద్దలు సాహసం చేసి కూర్చున్నా కేకలేసి వారిని క్రిందికి దింపించేవారు. ఇది ఓ మూడనమ్మకంగా గత కొద్దికాలం వరకు భావింపబడేది. డ్రౌసింగ్ రాడ్ ను కనుగొన్న తరువాత గడపపై కూర్చోరాదనడంలో శాస్త్రీయ అంశం ఉందని తెలియవచ్చింది.

డ్రౌసింగ్ రాడ్ అనే పరికరాన్ని తలుపు ఫ్రేంవద్ద ఉంచిన, అక్కడ ప్రతికూలశక్తి నలుదిశలా వెదజల్లబడడం మనం గమనించవచ్చు. కాబట్టే జ్ణ్జానవంతులైన మన పూర్వులకు ఈ విషయం ముందుగానే తెలుసుకాబట్టి, ఇలాంటి నిషేదం పెట్టారు. కాబట్టే తలుపు ఫ్రేం వద్ద ఎలాంటి పనులకు తావు ఇవ్వలేదు. అలా నిషేదించడానికి, తలుపు ఫ్రేం వద్ద ప్రతికూల శక్తి ప్రసారం ఉండడమే ఈ నిషేదం వెనుక రహస్యం.

why standing or sitting on gadapa is prohibited

ఇలా తలుపు ఫ్రేం నుండి ప్రతికూల శక్తి తరంగాల ప్రసారం ఉండటానికి గల కారణం ఫ్రేం చతురస్రాకారంలో ఉండడమే. ఈ విషయాన్ని గ్రహించే కాబోలు చైనీయులు కిటికీలను, తలుపులను పైభాగంలో వంపుగా ఆర్చ్ మాదిరి నిర్మిస్తారు. మన దేవాలయాలు మరియు చర్చీలు కూడా ద్వారల వద్ద పైభాగం వంపుగా ఆర్చీల మాదిరి నిర్మించబడి ఉన్నవి.

Admin

Recent Posts