రోజూ అర‌క‌ప్పు వాల్‌న‌ట్స్ తింటే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి.. అధ్య‌య‌నంలో వెల్ల‌డి..

వాల్‌న‌ట్స్‌లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. మ‌న‌కు అందుబాటులో ఉన్న అత్యుత్త‌మ పోష‌కాహారాల్లో వాల్ న‌ట్స్ ఒక‌టి. వీటిని రోజూ తినాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే రోజూ అర క‌ప్పు మోతాదులో వాల్ న‌ట్స్ ను తింటే శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌) త‌గ్గుతుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది.

రోజూ అర‌క‌ప్పు వాల్‌న‌ట్స్ తింటే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి.. అధ్య‌య‌నంలో వెల్ల‌డి..

అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ జ‌ర్న‌ల్.. స‌ర్క్యులేష‌న్‌లో పైన తెలిపిన అధ్య‌య‌నానికి చెందిన వివ‌రాల‌ను ప్ర‌చురించారు. రోజూ అర క‌ప్పు మోతాదులో 2 ఏళ్ల పాటు వాల్ న‌ట్స్ ను తిన్న‌వారిలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) స్థాయిలు త‌గ్గిన‌ట్లు వారు గుర్తించారు. అందువ‌ల్ల రోజూ వాల్ న‌ట్స్ ను తినాల‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

వాల్ న‌ట్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందువ‌ల్లే చెడు కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌) స్థాయిలు పెరుగుతాయి. దీంతో గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు. హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.

మ‌న శ‌రీరంలో ఎల్‌డీఎల్ క‌ణాలు ఏ సైజులో అయినా ఉండ‌వ‌చ్చు. చిన్న‌గా, పెద్ద మొత్తంలో ఉండే ఎల్‌డీఎల్ క‌ణాల వ‌ల్ల ర‌క్త‌నాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు వ‌స్తాయి. అయితే వాల్ న‌ట్స్‌ను రోజూ తిన‌డం వ‌ల్ల ర‌క్త నాళాల్లో పేరుకుపోయే కొవ్వు క‌రుగుతుంది. దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు.. అని సైంటిస్టులు చెబుతున్నారు. అందువ‌ల్ల రోజూ వాల్ న‌ట్స్‌ను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంద‌ని అంటున్నారు.

Admin

Recent Posts