Tattoo Causes Cancer : ప్రస్తుత తరుణంలో టాటూ వేయించుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. చాలా మంది తమకు ఇష్టమైన టాటూలను వేసుకుని సంబరపడిపోతున్నారు. శరీరంలోని పలు భాగాలపై లేదా కొందరు శరీరం మొత్తం టాటూలతో నింపేస్తున్నారు. ఈ క్రమంలోనే రకరకాల టాటూలు సైతం అందుబాటులో ఉంటున్నాయి. అయితే వాస్తవానికి టాటూ వేసుకోవడం అంత మంచిది కాదట. దీంతో క్యాన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయట. ఈ విషయాన్ని స్వీడన్‌కు చెందిన పలువురు సైంటిస్టులు వెల్లడించారు. టాటూలు వేయించుకోవడం వల్ల బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 21 శాతం మేర అధికంగా ఉంటాయని వారు చెబుతున్నారు.
స్వీడన్‌కు చెందిన సైంటిస్టులు కొందరు ఈ మధ్యే ఓ అధ్యయనం చేపట్టారు. అందుకు గాను వారు 20 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 11,905 మందిని ఎంపిక చేశారు. వారిలో 2,938 మందికి లైపోమా ఉన్నట్లు గుర్తించారు. అయితే మొత్తం మందిలో 21 శాతం మందికి అంటే 289 మందికి క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. వారికి టాటూలు అధికంగా ఉండడం విశేషం. మిగిలిన వారిలోనూ కొందరికి టాటూలు ఉన్నాయి. కానీ వారికి క్యాన్సర్ లేదు. కాకపోతే వారికి క్యాన్సర్ రిస్క్ ఉన్నట్లు నిర్దారించారు.
అయితే ఈ అధ్యయనంపై మరింత లోతుగా విశ్లేషణ జరగాల్సి ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా మనం శరీరంపై ఏదైనా భాగంపై టాటూ వేయించుకున్నప్పుడు అక్కడ ఇంక్ అనేది చర్మం లోపలికి ప్రవేశిస్తుంది. దీంతో రోగ నిరోధక వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. ఆ ఇంక్‌ను అది ఫారిన్ బాడీ (శరీరంతో సంబంధం లేనిది) గా చూస్తుంది. దీంతో ఆ ఇంక్‌ను అక్కడి నుంచి లింఫ్ వ్యవస్థకు సరఫరా చేస్తుంది. అక్కడ ఇంక్ ఎక్కువగా పేరుకుపోతుంది. ఫలితంగా అది క్యాన్సర్‌కు దారి తీస్తుంది. అందువల్ల టాటూలు వేయించుకోవడం అంత మంచిది కాదని, దీంతో బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 21 శాతం మేర అధికంగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే దీనిపై మరింత అధ్యయనం చేస్తామని వారు చెప్పారు.