అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

3 రోజులు వ‌రుస‌గా నిద్రించ‌క‌పోతే డ‌యాబెటిస్ వ‌స్తుంద‌ట‌..!

నిద్ర సరిగా పోనివారికి డయాబెటిస్ త్వరగా సోకే ప్రమాదముంది. మూడు రోజులు వరుసగా తగినన్ని గంటలు నిద్ర పోలేకపోతే శరీరంలో వచ్చే మార్పులలో ముఖ్యమైనది రక్తంలో గ్లూకోజ్ నియంత్రణగా గుర్తించారు. ఆ నియంత్రణ వ్యవస్థలో లోపం ఏర్పడటంతో షుగర్ జబ్బు వస్తుంది.

బలవంతంగా నిద్రను అదిమిపెట్టి రాత్రుళ్లు ఎక్కువసేపు మెలకువతో వుండే వారు గుర్తించాల్సిన విషయం ఇది. అయితే వయసులో ఉండగా దీని ప్రభావం వెనువెంటనే కనిపించకపోవచ్చు. కానీ భవిష్యత్తులో ఇబ్బంది కలిగించే ప్రమాదముంది. ఇక డయాబెటిస్ లక్షణాలు ఇప్పటికే కనిపించినవారు నిద్ర విషయంలో తగు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.

those who will not sleep for 3 days will get diabetes

నిద్రలేమి వారి కొంప ముంచుతుంది. దీనివల్ల హఠాత్తుగా రక్తంలో చక్కెరలు తారాస్థాయికి చేరి రోగిని కోమాలోకి తీసుకెళ్లే ప్రమాదముంది. కాబట్టి డయాబెటిస్ రోగులు తగినంత వ్యాయామం, నిద్ర విషయంలో తగిన జాగ్రత్త వహించడం మరువకూడదు.

Admin

Recent Posts