రక్తపోటు, షుగర్ వ్యాధి, గుండెసంబంధిత జబ్బులు, కీళ్ళ సమస్యలు లేదా మానసిక ఆరోగ్యం సరిలేకపోవటం మొదలైన వాటిని నియంత్రించే అతి సామాన్యమైన వ్యాయామం నడక. ఒబేసిటీ సమస్యల్లో నిపుణుడైన మేయో క్లినిక్ రీసెర్చర్ జేమ్స్ లెవిన్ మేరకు మీరు ఏ జిమ్ లోను చేరాల్సిన అవసరం లేదు. టి వి కట్టేయటం, సోఫా వదలి బయటికి వచ్చి నడక కొనసాగించటం అంతే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంటాడు. వయసు పైబడిన వారిలో తగ్గిన కండరాల బలానికి, అధిక రక్తపోటు నివారణకు నడక మరింత మంచిదంటాడు.
ఈ స్టడీలో భాగంగా జపాన్ దేశ రీసెర్చర్లు 246 మంది వయోజనులను సుమారు అయిదు నెలలపాటు నడక లేదా ఒక మాదిరి నుండి వేగవంతమైన నడకలో పరిశీలించారు. వేగంగా నడిచే గ్రూపు వారి ఆరోగ్యంలో ఎంతో మెరుగుదల చూపిందని రీసెర్చర్లు తెలిపారు. అందరి వ్యక్తులకు నడక అనేది విలువైన న్యాయబద్ధమైన వ్యాయామంగా చెప్పబడుతోంది. దీనికి ఒక క్లబ్బు లేదా జిమ్ లేదా ఒక శిక్షకుడు వుండాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరూ అనుసరించవచ్చు. అన్నిటికంటే మించి నడకకు ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా శరీరం మంచి షేప్ లోకి వచ్చేస్తుందని తెలిపారు.
నడిచేవారు ఎపుడు కావాలంటే అపుడు కనీసం కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా నడవవచ్చు. కూర్చొని వుండటం శరీరంలో చెడు కొలెస్టరాల్ ను పెంచుతుంది. వీపు కండరాలు బలహీనపడతాయి. కనుక ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి అందుబాటులో వుండి చక్కని ఫలితాలనిచ్చే వ్యాయామం నడక మాత్రమే నని పరిశోధకులు తేల్చారు.