హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు త‌మ వక్షోజాల‌ను పెంచుకునేందుకు ఈ చిట్కాల‌ను పాటించాలి..!

చాలామంది స్త్రీలు తమ వక్షోజాల పరిమాణాన్ని పెంచుకోడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అవి పెద్దగా మరియు అందంగా వుండి అందరిని ఆకర్షించటానికి సర్జరీలు సైతం చేయించుకోడానికి ప్రయత్నిస్తారు. అయితే, మహిళలు తమ పాలిండ్లను పెద్దవిగా చేసుకునేటందుకు, అందంగా చక్కటి షేప్ లో వుంచుకోడానికి సహజమైన పద్ధతులు కొన్ని వున్నాయి. అవి ఏమిటనేది చూద్దాం. బ్రెస్ట్ సైజ్ పెంచుకోవాలంటే అతి సామాన్యమైన పద్ధతి వాటిపై ఒత్తిడి కలిగించటం. బోర్లా పరుండండి, బెడ్ కు గాని లేదా నేలకుగాని తగిలిస్తూ తగుమాత్రం ఒత్తిడి కలిగించండి. లేదా నిలబడి గోడకు ఎదురుగా ప్రెస్ చేయవచ్చు. వెంటనే రిలాక్స్ అవండి ఈ విధంగా రోజూ పది సార్లు చేస్తూ వుండండి.

సాధారణంగా చేసే పుష్ అప్ లు కూడా బ్రెస్ట్ సైజు పెంచుకోడానికి మంచివే. కొత్తగా మొదలుపెట్టేవారైతే రోజుకు 10 చొప్పున మెల్లగా 15 నుండి 25 సార్లవరకు పెంచండి. తిన్నగా నిలబడండి, చేతులు కొద్దిగా మోచేతులవద్ద వంచండి చేతులను పిరుదులపై పెట్టండి. ఎడమ మోచేతిని కుడిదానితోను కుడిమోచేతిని ఎడమదానితోను వెనుకనుండి పట్టుకోండి. 10 నుండి 15 సెకండ్ల గ్యాప్ తో పది సార్లు చేయండి. బస్ట్ సైజ్ పెరగాలంటే స్విమ్మింగ్ మంచిది. స్విమ్మింగ్ చేయని వారైతే తిన్నగా నిలబడి గాలిలోకి ముందు వెనుక ఊగండి. దీనిని కనీసం 20 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

how to increase breast size in woman naturally

మీ అరచేతులను వక్షాలపై పెట్టుకొని ఒకదానికొకటి కలిపి ప్రెస్ చేస్తూ అయిదు సెకండ్లు ఉంచండి. దీనిని 10 సార్లు చేయండి. అయిదు నుండి 10 కేజీల బరువులను తీసుకొని వెల్లకిలా పడుకొని చేతులతో బరువులను పైకి లేపండి. ఈ చిట్కాలు పాటిస్తే మహిళల వక్షాలు సహజరీతిలో పెద్దవవటమే కాక చక్కటి ఆరోగ్యం కూడా లభిస్తుంది.

Admin

Recent Posts