Diwali Laxmi Puja : ఈ ఏడాది దీపావళి పండుగ రోజు లక్ష్మీ పూజకు సరైన ముహూర్తం ఇదే!

Diwali Laxmi Puja : హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం కార్తీక మాస అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాలలో ఈ పండుగను ఐదు రోజులపాటు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. మరి కొందరు ధన త్రయోదశి నుంచి ఈ పండుగను మూడు రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అలాగే ఈ ఏడాది దీపావళి పండుగ నవంబర్ 4వ తేదీ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.

Diwali Laxmi Puja best time for puja

చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటారు. అయితే దీపావళి పండుగ రోజు సాయంత్రం లక్ష్మీదేవికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది అమ్మవారికి పూజ చేయడానికి సరైన సమయం ఏది అనే విషయానికి వస్తే.. సాయంత్రం అమ్మవారికి పూజ చేయడానికి 3:18 నిమిషాల నుండి రాత్రి 10:30 నిమిషాల వరకు మంచి సమయం ఉంది. శ్రీ ధనలక్ష్మి అమ్మవారికి ఆ సమయంలో విశేషపూజలు చేయవచ్చు.

అయితే దీపావళి పండుగ రోజు చాలామంది నోములు చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొత్తగా నోములు చేసే వారికి దీపావళి ఎంతో మంచిదని, కొత్తగా నోములు చేసేవారు పలు కారణాల వల్ల నోములను మానేసిన వారు తిరిగి చేసుకోవాలన్నా ఈ పండుగ రోజు చేయడం ఎంతో మంచిదని పండితులు తెలియజేస్తున్నారు.

దీపావళి పండుగ రోజు లక్ష్మీ పూజ చేయడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు. దీంతో సకల శుభాలు కలుగుతాయని, సంపద సిద్ధిస్తుందని, ఆయురారోగ్య  ఐశ్వర్యాలు కలుగుతాయని అంటున్నారు.

Share
Sailaja N

Recent Posts