ప్రపంచంలోనే అత్యంత ధనికమైన క్రీడా అంటే మొదటగా గుర్తుకు వచ్చేది క్రికెట్. ప్రపంచంలోని ఏ మూలన చూసిన, క్రికెట్ అంటే చాలామంది ఇష్టపడే వారే ఉంటారు. మొదట్లో టెస్టులు, ఆ తర్వాత వన్డేలు, ఇప్పుడు టి20 సీజన్ ఈ క్రికెట్ లో కనిపిస్తోంది. టి20 క్రికెట్ వచ్చిన తర్వాత ఆ ఆటలో ఎన్నో మార్పులు వచ్చాయి. అలాగే రోజురోజుకు ఎన్నో రికార్డులు, హిస్టరీలు, వింతలు చోటు చేసుకుంటున్నాయి. అయితే వన్డే క్రికెట్ లో అత్యంత చెత్త ప్రదర్శన ఇచ్చిన ప్లేయర్లు ఉన్నారు. వన్డే క్రికెట్ లో పది ఓవర్లు వేసి ఎక్కువ రన్స్ ఇచ్చిన బౌలర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆసీస్ కు చెందిన మైఖేల్ లూయిస్ 10 ఓవర్లు వేసి.. ఏకంగా 113 పరుగులు ఇచ్చి.. చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. పాకిస్థాన్ దేశానికి చెందిన వహాబ్ రియాజ్ 10 ఓవర్లు వేసి.. ఏకంగా 110 పరుగులు ఇచ్చి.. చెత్త రికార్డును తన పేరిట వేసుకున్నాడు. ఆఫ్ఘనిస్థాన్ దేశానికి చెందిన రషీద్ ఖాన్ 9 ఓవర్లు వేసి.. ఏకంగా 110 పరుగులు ఇచ్చి.. చెత్త రికార్డును తన పేరిట వేసుకున్నాడు. నెదర్లాండ్స్ దేశానికి చెందిన రొనాల్డ్ పీటర్స్ 10 ఓవర్లు వేసి.. ఏకంగా 108 పరుగులు ఇచ్చాడు. భారత దేశానికి చెందిన భువ నేశ్వర్ కుమార్ 10 ఓవర్లు వేసి.. ఏకంగా 106 పరుగులు ఇచ్చాడు. శ్రీలంక దేశానికి చెందిన నువాన్ ప్రదీప్ 10 ఓవర్లు వేసి.. ఏకంగా 106 పరుగులు ఇచ్చాడు.
న్యూజిలాండ్ దేశానికి మార్టిన్ కొలిన్ 10 ఓవర్లు వేసి.. ఏకంగా 105 పరుగులు ఇచ్చాడు. న్యూజిలాండ్ దేశానికి టిమ్ సౌతీ 10 ఓవర్లు వేసి.. ఏకంగా 105 పరుగులు ఇచ్చాడు. జింబాబ్వే దేశానికి బ్రియాన్ విటోరీ 9 ఓవర్లు వేసి.. ఏకంగా 105 పరుగులు ఇచ్చాడు. విండీస్ దేశానికి జాసన్ హోల్డర్ 10 ఓవర్లు వేసి.. ఏకంగా 104 పరుగులు ఇచ్చాడు.