technology

ఈ స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారా..? జాగ్రత్త సుమా..!

భారతదేశ ప్రభుత్వం తాజాగా ఒక అలెర్ట్ ని జరీ చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగిస్తున్న వారు ముఖ్యంగా ఈ వెర్షన్ ఫోన్స్ ఉపయోగిస్తున్న యూజర్స్ ఎంతో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాలు జరుగుతున్నాయి అని చెప్పింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ప్రకారం స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించడం మీ చేతిలో ఉన్నా హ్యాకర్స్ దాని కంట్రోల్ ను తీసుకోగలరని సెక్యూరిటీ బ్రీచ్ జరగవచ్చని అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ముఖ్యంగా గూగుల్ క్రోమ్ మరియు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఉపయోగిస్తున్నట్లయితే ఎన్నో అవకాశాలు మీరు హ్యాకర్ కి ఇస్తున్నట్టే.

ఫ్రేమ్ వర్క్, సిస్టం మరియు మీడియా టెక్ కాంపోనెంట్స్ వంటి కీలకమైన భాగాలు ఉన్నా దానిలో బలహీనతలను సిఈఆర్టి ఇన్ వాటి బలహీనతలు హైలెట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వెర్షన్స్ లో బలహీనతలు ఉన్నాయని అంటున్నారు. ఆండ్రాయిడ్ 12, ఆండ్రాయిడ్ 12 ఎల్, ఆండ్రాయిడ్ 13, ఆండ్రాయిడ్ 14 మరియు ఆండ్రాయిడ్ 15. దాంతో హ్యాకర్స్ కు కీలక సమాచారాన్ని దొంగలించడానికి సులువు అవుతుంది.

if you are using these phones then be alert

యూజర్స్ ప్రైవసీ కోసం సిస్టం అప్డేట్స్ ను తరచుగా చేయాలి అని చెప్పారు. గూగుల్ క్రోమ్ ని వినియోగిస్తున్న వారు ప్రైవసీని కాపాడుకోవడానికి సిస్టమ్ అప్డేట్స్ చేయడం తో పాటుగా అనాథరైజ్డ్ యాక్సెస్ ఇవ్వకుండా చూసుకోవాలి. ఇలా చేయకపోతే మీ డేటాను దొంగలించవచ్చు, మాల్వేర్ వంటి వాటిని ఇన్స్టాల్ చేసి కంట్రోల్ ని పొందవచ్చు.

Share
Peddinti Sravya

Recent Posts