Ravi Chettu : మనలో చాలా మంది పెళ్లి అయ్యి చాలా రోజులు అవుతున్నా ఇంకా పిల్లలు పుట్టడం లేదని బాధపడుతున్నారు. కొందరు పెళ్లి అయిన సంవత్సరం లోపే గర్భం దాల్చుతున్నారు. కొందరు పెళ్లి అయ్యి చాలా సంవత్పరాలు గడుస్తున్నా గర్భం దాల్చలేకపోతున్నారు. సంతానం కలగకపోవడానికి చాలా మంది స్త్రీలలోనే లోపాలు ఉంటాయని భావిస్తూ ఉంటారు. కానీ సంతానం కలగకపోవడానికి పురుషులు కూడా కారణమవుతారు. వీరిలో కూడా సంతాన లోపాలు ఉంటాయి. మహిళ గర్భం దాల్చాలంటే అండం, శుక్ర కణం రెండు కలవాలి. అంతేకాకుండా స్త్రీల గర్భాశయంలో ఎటువంటి లోపాలు ఉండకూడదు.
ప్రస్తుత కాలంలో సంతానం కలగకపోవడానికి లోపాలు ఎవరిలో ఉన్నాయో వైద్యులు సులువుగా చెప్పగలుగుతున్నారు. కానీ పూర్వకాలంలో వైద్య సదుపాయాలు లేకపోవడంతో లోపం ఎవరిలో ఉందో తెలుసుకోలేకపోయే వారు. కనుక పూర్వకాలంలో స్త్రీ, పురుషులిద్దరూ వైద్యాన్ని తీసుకోవాల్సి వచ్చేది. పూర్వకాలంలో గర్భం దాల్చడానికి అనుసరించిన పద్దతి ఏమిటి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గర్బం దాల్చడానికి మన పూర్వీకులు రావి చెట్టు పై ఆధారపడేవారు. రావి చెట్టు దేవాలయాలలో, రోడ్డు పక్కన మనకు కనబడుతూనే ఉంటుంది. ఈ రావి చెట్టును ఆధ్యాత్మికంగానే కాకుండా ఔషధంగా కూడా ఉపయోగిస్తారన్న సంగతి మనకు తెలిసిందే.
త్వరగా గర్భం దాల్చాలనుకునే స్త్రీలు భర్తతో కలిసి రావి చెట్టు దగ్గరకు వెళ్లి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి ఒక తెల్లని దారాన్ని తీసుకుని దానిని రావి చెట్టు చుట్టూ 5 సార్లు తిరుగుతూ కట్టాలి. ఈ విధంగా కట్టిన తరువాత ఆ చెట్టు పండ్లను సేకరించి ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని అర టీ స్పూన్ మోతాదులో తీసుకుని దానికి ఒక టీ స్పూన్ స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కలిపి ఉదయం, రాత్రి రెండు పూటలా భార్యాభర్తలిద్దరూ తీసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల లోపాలు తొలగిపోయి స్త్రీ త్వరగా గర్భం దాలుస్తుందని, ఇలా చేయడం వల్ల సంతానం కలిగిన వారు కూడా ఉన్నారని మన పూర్వీకులు చెబుతున్నారు. కనుక ఈ విధంగా చేయడం వల్ల ఫలితం ఉంటుందని ఆశించవచ్చు.