Regu Chettu : రోజూ ప‌ర‌గ‌డుపునే రేగు చెట్టు ఆకులు 10 తినండి.. ఏం జ‌రుగుతుందో తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు..!

Regu Chettu : మ‌న‌కు ఎన్నో రకాల పండ్ల‌ను, పువ్వుల‌ను చెట్లు అందిస్తాయి. వీటిని మ‌నం ఎంత‌గానో ఉప‌యోగించుకుంటాం. అదే విధంగా ఈ పండ్ల‌ను, పువ్వుల‌ను అందించే చెట్ల ఆకులు కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అవి కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. అలాంటి చెట్లలో రేగు చెట్టు కూడా ఒక‌టి. రేగు చెట్టు నుండి మ‌న‌కు రేగు పండ్లు వ‌స్తాయి. ఈ పండ్ల‌ను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. రేగు చెట్టు ఆకులు ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. కొన్ని ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఈ రేగు చెట్టు ఆకులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. రేగు చెట్టు ఆకుల‌ను ఉప‌యోగించి ఏయే వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌నం మ‌న ఆరోగ్యం కోసం ఎంత‌గానో ఖ‌ర్చు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఎంత ఖ‌ర్చు చేసిన‌ప్ప‌టికీ కొన్ని ర‌కాల రోగాలు న‌యం అవ్వ‌వు. అలాంటి కొన్ని ర‌కాల వ్యాధులను మ‌నం రేగు ఆకుల‌ను ఉప‌యోగించి న‌యం చేసుకోవ‌చ్చు. ఉద‌యం లేవ‌గానే ప‌ది రేగు చెట్టు ఆకుల‌ను సేక‌రించి శుభ్రంగా క‌డిగి వాటిని తినాలి. ఇలా తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది చిన్న వ‌య‌స్సులోనే హార్ట్ ఎటాక్ ల బారిన ప‌డుతున్నారు. ఇలా హార్ట్ ఎటాక్ ల బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో రేగు ఆకులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. రోజూ ఉద‌యం 10 రేగు చెట్టు ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల హార్ట్ ఎటాక్ లు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Regu Chettu leaves wonderful health benefits
Regu Chettu

అంతేకాకుండా ఈ ఆకులను తిన‌డం వ‌ల్ల అజీర్తి, గ్యాస్ వ‌ల్ల వ‌చ్చే క‌డుపు నొప్పి త‌గ్గుతాయి. నిద్ర‌లేమి స‌మ‌స్య‌కు రేగు ఆకులు మంచి ఔష‌ధంగా ప‌ని చేస్తాయి. రోజూ రాత్రి ప‌డుకునే ముందు రేగు చెట్టు ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల నిద్ర బాగా ప‌డుతుంది. అంతేకాకుండా ఈ రేగు ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. ఈ విధంగా రేగు ఆకుల‌ను తిని మ‌న‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts