vastu

మీరు తీవ్ర‌మైన పేద‌రికంలో ఉన్నారా.. ఈ మొక్క‌లే కార‌ణం కావ‌చ్చు..

భారతీయులు వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యమిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం, ఇంట్లో వస్తువులను పెట్టుకోవడం ఎంత అవసరమో వాస్తు నియమాలను పాటించడం కూడా అంతే అవసరమని అనేక సందర్భాలలో తెలుసుకున్నాం. ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించడం వల్ల ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా జీవితం గడిపే వీలుంది.

చాలామందికి ఇళ్లల్లో మొక్కలు పెంచుకోవడం అలవాటు. పూల మొక్కలతో పాటు అందమైన బోన్సాయి మొక్కలను కుండీల్లో పెంచుతుంటారు. అవి మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మనలో మానసిక ప్రశాంతతను పెంచుతాయి. కొందరు మనీ ప్లాంట్ మొక్కను ఇంటి గుమ్మం ముందు ఉంచుతారు. ఇది బాగా పెరిగితే ఆ ఇంట్లో డబ్బుకు కొదువ ఉండదని ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. ఒకవేళ అది ఎండిపోతే మాత్రం ఆ ఇంట్లో ఆర్థిక కష్టాలు వస్తాయని విశ్వసిస్తారు.

if you have these plants in your home then you will become poor

ఇంటి పరిసరాల్లో గోరింటాకు, చింత చెట్టు ఉండకూడదట. అలాగే తుమ్మ, రేగు వంటి ముళ్ళ మొక్కలను నాటకూడదు. ఇంట్లో పత్తి, నిమ్మకాయల చెట్లు ఉన్న అక్కడ ప్రతికూల శక్తి ఉంటుంది. అలాంటి ఇళ్లల్లో మానసిక ఒత్తిడితో పాటు ఆర్థిక సమస్యలు వస్తాయట. కొంతమంది తమ ఇళ్లల్లో కాక్టస్, మిరప మొక్కలను కూడా ఇష్టంగా పెంచుకుంటారు.

ఇవి చూసేందుకు అందంగా, మనసుకు ఆహ్లాదంగా అనిపించవచ్చు. కానీ ఇంట్లో ఇలాంటి మొక్కలను ఉంచుకోవడం మంచిదికాదట. నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇంట్లో ఇబ్బందులు వస్తాయట.

Admin

Recent Posts