vastu

ఏ స‌మ‌యంలో డ‌బ్బు ఇవ్వాలి.. ఏ స‌మ‌యంలో ఇవ్వ‌కూడ‌దు..?

వాస్తు సూత్రాలు ఇల్లు, జీవితంపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. దీని వల్ల జీవితంలో సానుకూలత, శ్రేయస్సు వస్తాయి. వాస్తు శాస్త్రంలో డబ్బు లావాదేవీలకు సంబంధించిన నియమాలు, సమయాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. డబ్బు లావాదేవీలకు సంబంధించి వాస్తు నియమాలను పాటించకపోతే ఇంట్లో దరిద్రం పీడిస్తుంది. వాస్తు ప్రకారం డబ్బు లావాదేవీలు చేయడానికి సరైన సమయం ఏమిటో తెలుసుకుందాం. ఎప్పుడు డబ్బు ఇవ్వాలి, ఏ సమయంలో లావాదేవీలు చేయకూడదో తెలుసుకుందాం.

సాయంత్రం సమయంలో డబ్బు లావాదేవీలు చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత డబ్బు లావాదేవీలు చేయడం అశుభంగా భావిస్తారు. సూర్యోదయం తర్వాత వెంటనే డబ్బు లావాదేవీలు చేయకూడదు. ఆర్థిక లావాదేవీలకు ఈ సమయం అంత అనుకూలం కాదు. కావాలంటే మరుసటి రోజు ఇవ్వడం లేదంటే, తీసుకోవడం లాంటివి చేయవచ్చు. సూర్యోదయానికి దాదాపు గంటన్నర ముందు బ్రహ్మ ముహూర్తం. ఈ సమయం ఆధ్యాత్మికానికి అంకితం చేయాలి. డబ్బు లావాదేవీలకు ఈ సమయం అనుకూలం కాదు.

in which time we have to give money in which time we have not

వాస్తు శాస్త్రం, సాంప్రదాయ నమ్మకాల ప్రకారం.. అశుభ సమయాల్లో డబ్బు లావాదేవీలు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఈ సమయాల్లో డబ్బు లావాదేవీలు చేస్తే సంపదకు అధిష్టాత్రి అయిన లక్ష్మీదేవికి కోపం వస్తుందని నమ్ముతారు. సూర్యోదయం తర్వాత కొన్ని గంటల తర్వాత, సూర్యాస్తమయానికి ముందు వరకు డబ్బు లావాదేవీలు చేయడానికి అనుకూలమైన సమయం.

Admin

Recent Posts