Office Desk : ప్రతి ఒక్కరు కూడా, మంచి జరగాలని పాజిటివ్ ఎనర్జీ కలగాలని కోరుకుంటారు. ఎవరు కూడా, బాధలు కలగాలని, ఆనందంగా ఉండకుండా ఉండాలని అనుకోరు. సంతోషంగా ఉండాలంటే, వాస్తు బాగా ఉపయోగపడుతుంది. మంచి జీవితం కోసం, వాస్తు మనకి ఎంతగానో సహాయపడుతుంది. చక్కటి ఫలితాలని వాస్తు తీసుకువస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మనం నడుచుకుంటే, ఇబ్బందుల నుండి కూడా బయట పడవచ్చు. వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ నష్టాలు లేకుండా మంచి జరగాలి అంటే, ఇలా పాటించడం మంచిది. వాస్తు ప్రకారం ఇలా చేయడం వలన సక్సెస్ ని అందుకుంటారు. సమస్యలు నుండి బయట పడవచ్చు. వాస్తు ప్రకారం ఆఫీసు డస్క్ మీద వెదురు మొక్కని ఉంచుకోవడం చాలా మంచిది.
ప్రతికూలతను తొలగించి, అనుకూల శక్తిని ఇస్తుంది. బాంబు ప్లాంట్ ని లక్కీ బ్యాంబు అని కూడా పిలుస్తూ ఉంటారు. డెస్క్ పైన ఈ మొక్కని ఉంచితే ప్రశాంతత ఉంటుంది. పైగా అదృష్టాన్ని కూడా ఈ మొక్క మనకి తీసుకువస్తుంది. కాబట్టి, లక్కీ బాంబు ప్లాంట్ ని పెట్టుకోండి. బంగారు నాణేలతో ఉన్న ఓడ తరహా బొమ్మలు గిఫ్ట్ షాపుల్లో మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. డస్క్ మీద ఇటువంటివి పెడితే కూడా డబ్బులు బాగా వస్తాయి.
కష్టాల నుండి గట్టెక్కడానికి కూడా అవుతుంది. ఆఫీసు డెస్క్ మీద పిరమిడ్ ఉంచుకుంటే కూడా మంచిది. చెక్క లేదంటే గాజుతో తయారు చేసిన పిరమిడ్ తరహా వస్తువులు ఉంచితే, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. క్రిస్టల్ వస్తువులని ఆఫీసు డెస్క్ మీద ఉంచడం మంచిది.
గాజుతో చేసిన పేపర్ వెయిట్ లు, క్రిస్టల్ బొమ్మలు ఉంచుకుంటే అదృష్టం వస్తుంది. అలానే, ఆఫీస్ డస్క్ మీద చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. ఎప్పుడూ కూడా క్లీన్ గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా చేయడం వలన మంచి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు.