vastu

ఇంట్లో వెండి ఏనుగు బొమ్మలు ఉంచితే ఏమవుతుందో తెలుసా?

సాధారణంగా మన భారతీయులు వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతారు. ఈ క్రమంలోనే ఇంటి నిర్మాణం నుంచి ఇంట్లో అలంకరించుకునే వస్తువులు వరకు ప్రతి ఒక్కటి వాస్తు ప్రకారం అలంకరించుకుంటారు. అయితే చాలా మంది వెండి ఏనుగులను ఇంట్లో పెడితే ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం వెండి ఏనుగు సైజుతో సంబంధం లేకుండా మన ఇంట్లో ఉంచడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.

వెండి ఏనుగును మన ఇంట్లో ఉత్తరం దిక్కున పెట్టడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా మన ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. వెండి ఏనుగు బొమ్మను ఇంట్లో దేవుడి గదిలో ఉంచడం వల్ల ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది. అదేవిధంగా ఆఫీసులలో లేదా వ్యాపార సంస్థల యందు ఉంచడం వల్ల వారి వ్యాపారం దినదినాభివృద్ధి కలుగుతుంది.

silver elephant idol in home benefits

ఏనుగులు మన ఇంటికి రక్షణగా నిలుస్తాయి.మన ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా పాజిటివ్ ఎనర్జీని గ్రహించాలంటే బొమ్మలను ప్రధాన ద్వారం ఇరువైపులా ఉంచటం వల్ల మన ఇంట్లో ఎప్పుడు ప్రశాంతత కలిగి ఉంటుంది. ముఖ్యంగా తెల్ల ఏనుగు మన ఇంట్లో సంపదను కలిగించి ధనవంతులుగా చేస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.

Admin

Recent Posts