vastu

ఆలయ నీడ పడే ప్రాంతంలో ఇంటిని నిర్మిస్తే ఇంత ప్రమాదమా..?

పూర్వకాలం నుంచి పెద్దలు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెతను వాడుతూ ఉంటారు. అంటే ఒక పెళ్లి చేయాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా మనం ఎంతో ఆలోచన చేసి చేసుకునే పనులు. ఇల్లయినా వందేళ్లు ఉండాల్సిందే, పెళ్లయిన వందేళ్లు జీవించాల్సిందే. కాబట్టి ముఖ్యంగా ఇల్లు కట్టేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి అవేంటో ఒకసారి చూద్దాం.. ఇల్లు కట్టేటప్పుడు దేవాలయం నీడ పడే ప్రాంతంలో ఇంటిని కట్టుకో కూడదని వాస్తు నిపుణులు సలహా ఇస్తుంటారు. ఆగమశాస్త్రం ప్రకారం ఎంతో సంప్రదాయబద్ధంగా దేవాలయాలను నిర్మిస్తారు. బీజాక్షరాలతో కూడిన దేవతా యంత్రం ఆపై విగ్రహాన్ని దేవాలయాల్లో ప్రతిష్టిస్తారు.

ఆలయాల్లో నిత్యం పూజలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అయితే మనం దేవాలయం పక్కన ఇల్లు కట్టుకోవడం వల్ల మన ఇళ్లలో అశుభ కార్యాలు జరుగుతూ ఉంటాయి. దీని ప్రభావం అనేది దేవాలయం మీద పడి గుడికి వచ్చే భక్తుల పై ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే గుడి నీడ ఇంటి పై పడవద్దు అంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం చూస్తే శివాలయానికి వెనకవైపు వైష్ణవ ఆలయానికి ముందు వైపు ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు. కానీ గుడికి ఆనుకొని ఏ ఇళ్ళు ఉండకూడదు. కడితే అనవసర వివాదాలు కలహాలకు అవకాశముంటుంది.

why you should not build house near temple

గర్భగుడిలోని మూలవిరాట్ విగ్రహం నుంచి 200 అడుగుల దూరంలోపు ఇంటిని నిర్మించక పోవడం చాలా మంచిది. వైష్ణవ ఆలయానికి అత్యంత సమీపంలో నిర్మించిన ఇంట్లో డబ్బు నిలువదు అంటారు. శివాలయానికి సమీపంలో ఇల్లు కడితే శత్రుభయం ఎక్కువగా ఉంటుంది. అలాగే శక్తి ఆలయానికి దగ్గరలో ఇల్లు ఉంటే పురోగతి కనిపించదని వాస్తు పండితులు చెబుతుంటారు. గణపతి ఆలయానికి ఉత్తరం, వాయువ్య దిశలో 200 అడుగుల లోపు ఇంటి నిర్మాణం చేపట్టవద్దు. ఇలా ఉన్న ఇంట్లో వృధా ఖర్చులు అవమానాలకు ఆస్కారం ఉంటుంది.

Admin

Recent Posts