ఈమధ్య కాలంలో పిల్లలు చాలా వయొలెంట్‌గా ప్రవర్తిస్తున్నారు. ఫోన్ల పుణ్యమా అని వారు మరీ హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నారు. అందులో వీడియోలు చూసి, గేమ్స్ ఆడి కాలాన్ని మరిచిపోవడమే కాదు, అన్ని రకాలుగా నష్టపోతున్నారు. ముఖ్యంగా ఇలాంటి పిల్లల మానసిక ప్రవర్తన అసలు బాగుండడం లేదు. తమకు తల్లిదండ్రులు ఫోన్ ఇవ్వకపోతే ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. ఓ బాలుడు తనకు ఫోన్ ఇవ్వలేదని తల్లిని బ్యాట్‌తో కొట్టాడు. ఈ సంఘటన అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళ తన కొడుకు ఫోన్ చూస్తుండగా తిట్టి చదువుకోమని చెప్పి ఫోన్ లాక్కుంది. అయితే కాసేపు ఆ బాలుడు చదివినట్లు నటించి అనంతరం పక్కనే ఉన్న బ్యాట్‌తో ఆమె తలపై కొట్టాడు. దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది.
అయితే ఈ సంఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో సైతం రికార్డయింది. దీంతో ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా దాన్ని చూసిన అందరూ నివ్వెరపోతున్నారు. పిల్లలు మరీ ఇలా ప్రవర్తిస్తున్నారేంటి.. అని షాకవుతున్నారు. మీ పిల్లలు కూడా ఫోన్‌కు అడిక్ట్ అయితే వెంటనే ఆ అలవాటు నుంచి మాన్పించేయండి. లేదంటే జరగరానిది జరిగితే ఆ తరువాత అందరూ బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి.