viral news

వెంట్రుక‌వాసిలో మృత్యువు నుంచి త‌ప్పించుకున్న చిన్నారులు.. వీడియో..

మృత్యువు అనేది ఏ రూపంలో వ‌స్తుందో ఎవ‌రికీ తెలియ‌దు. ఎవ‌రికి ఎంత వ‌ర‌కు ఆయుష్షు రాసి పెట్టి ఉంటే అంత వ‌ర‌కు జీవిస్తారు. ఇది అక్ష‌రాలా స‌త్య‌మేన‌నిపిస్తుంది ఆ వీడియో చూస్తే. అవును, ఆ ఇద్ద‌రు చిన్నారులు తృటిలో పెను ప్రమాదం నుంచి త‌ప్పించుకున్నారు. మృత్యువు వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి వెంట్రుక వాసిలో త‌ప్పిపోయింది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటి… ఏం జ‌రిగింది.. అంటే..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్‌లో ఉన్న స‌ద‌ర్ బ‌జార్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఢొల్కి మొహ‌ల్లా అనే ప్రాంతంలో 100 ఏళ్ల కింద‌టి ఓ పురాత‌న బిల్డింగ్ ఉంది. అది స్థానిక జైన క‌మ్యూనిటీకి చెందిన‌ది. దాన్ని కూల్చేయాల‌ని స్థానిక కంటోన్మెంట్ బోర్డు వారు స‌ద‌రు క‌మ్యూనిటీకి నోటీసులు కూడా జారీ చేశారు. కానీ ఆ భ‌వ‌నాన్ని వారు కూల్చ‌లేదు. అయితే తాజాగా ఆ భ‌వంతి ముందు భాగం కుప్ప‌కూలిపోయింది.

two kids narrowly escaped from collapsed building

అదే స‌మయంలో అటుగా వెళ్తున్న ఓ మ‌హిళ‌, ఇద్ద‌రు బాలురు వెంట్రుక వాసిలో ఆ పెను ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నారు. వారు అలా క్రాస్ అయ్యారో లేదో భ‌వంతి కూలిపోయింది. దాన్ని చూసిన ఆ చిన్నారులు వెంట‌నే అక్క‌డి నుంచి ప‌రుగులు పెట్టారు. కాస్త ఆల‌స్యంగా వారు వ‌చ్చి ఉంటే ఆ భ‌వంతి శిధిలాల కింద ప‌డి చ‌నిపోయి ఉండేవారు. అక్క‌డే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌యిన దృశ్యాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అంద‌రూ అదృష్టం అంటే ఆ చిన్నారుల‌దే అంటున్నారు. అవును, కాస్తలో త‌ప్పిపోయింది కానీ లేదంటే ఘోర ప్ర‌మాదం జ‌రిగి ఉండేది. ఇక ఈ సంఘ‌ట‌న తాలూకు వివ‌రాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.

Admin

Recent Posts