యోగా

ఆ ఆసనాన్ని ఎప్పుడు పడితే అప్పుడు వేయకూడదు…!

వక్రాసన యోగా. దీనిని అర్థ మత్స్యేంద్రాసన అని కూడా పిలుస్తారు. ఇది హఠ యోగాలోని 12 స్థూల ఆసనాల్లో ఒకటిగా ఉంది. అయితే దీనిని వేయడానికి ఎప్పుడు పడితే అప్పుడు కుదరదు అన్నమాట. ఉదయాన్నే పరగడుపున వేయాలి. అప్పుడు కుదరకపోతే భోజనం చేసిన 4 నుంచి 6 గంటల తర్వాత మాత్రమే వెయ్యాల్సి ఉంటుంది. అది వేసే సమయంలో కడుపు ఖాళీగా ఉండాల్సిందే. ఆ ఆసనం వేసే విధానం ఒకసారి చూద్దాం.

కటి ఎముకలు నేలకు తగిలే విధంగా కూర్చుని, కుడి కాలు మడిచి, పాదం ఎడమ పిరుదుకు తగిలే విధంగా ఉంచాలి. ఎడమ కాలును కుడి కాలు మీదుగా అవతలకు వేసి పాదాన్ని నేలకు తాకించాలి. నడుము పై భాగాన్ని ఎడమ వైపుకు తిప్పాలి. ఆ తర్వాత చేతులు రెండూ జోడించి ఉంచాలి.

how to do ardha matsyendrasana and know its benefits

ఈ భంగిమలో 30 నుంచి నిమిషం పాటు ఉండి, రెండో వైపు కూడా చేయాలి. ఈ ఆసనం వేస్తున్నంతసేపు కూడా నెమ్మదిగా ఊపిరి పీల్చుకోవాల్సి ఉంటుంది. ఆసనం వల్ల లాభాలు ఒకసారి చూస్తే.. కీలకమైన వెన్ను బలంగా తయారవడంతో పాటుగా వెన్ను పనితీరు మెరుగుపడుతుంది. వెన్నుపూసల మధ్య బిగుతును తొలగించడంతో వెన్ను నొప్పి నుంచి శాశ్వత పరిష్కారం ఉంటుంది.

పిత్తాశయాన్ని ప్రేరేపించడం ద్వారా, మధుమేహం సమస్యను అనేది క్రమంగా తగ్గుతుంది. ఈ ఆసనం అడ్రినలిన్‌, బైల్‌ స్రావాలను క్రమబద్ధం చేస్తుంది. అదే విధంగా నడుములో బిగుసుకున్న కీళ్లను ఈ ఆసనం వదులు చేస్తుంది. కటి ప్రదేశానికి రక్తప్రసరణను మెరుగు పరిచి, పోషకాలు, రక్తం, తద్వారా ఆక్సిజన్‌ అందేలా చేసి, పునరుత్పత్తి, మూత్ర వ్యవస్థలు సక్రమంగా పని చేసే విధంగా ప్రోత్సహిస్తుంది.

Admin

Recent Posts