Aishwarya Rajinikanth : నటుడు ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య రజనీకాంత్‌లు ఇటీవలే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. తమ 18 ఏళ్ల వివాహ బంధానికి వారు ఈ మధ్యే స్వస్తి పలికారు. అయితే వీరి విడాకుల నిర్ణయం అందరినీ షాక్ కు గురిచేసింది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ విషయంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయనకు వారు ఇలా చేయడం ఇష్టం లేదని తెలిసింది. అయితే ఆయన వారిద్దరినీ కలపాలని అనుకున్నారని కూడా వార్తలు వచ్చాయి.
ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం.. రజనీకాంత్.. ధనుష్‌ను తన అల్లుడిగా ఎంతమాత్రం ఒప్పుకోనని అన్నారట. ఐశ్వర్య తన భర్త ధనుష్‌తో మళ్లీ కలిసి ఉండేందుకు సుముఖంగానే ఉందట. కానీ రజనీకాంత్ వద్దన్నారట. ఈ క్రమంలోనే ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ విడిపోయిన తరువాత కొన్ని రోజుల పాటు రజనీ వారిని కలిపేందుకు తీవ్రంగా ప్రయత్నించారట. కానీ ధనుష్ అసలు ఒప్పుకోలేదట.
కుమార్తె ఐశ్వర్య.. తిరిగి ధనుష్‌తో కలసి ఉంటానని చెప్పిందట. కానీ ధనుష్ ఒప్పుకోకపోవడంతో రజనీ వారిని కలిపే ప్రయత్నం మానుకున్నారట. ఇక ధనుష్‌ను ఆయన తన అల్లుడిగా ఎంత మాత్రం అంగీకరించబోనని అన్నారట. దీంతో ఇక వీరి విడాకులు దాదాపుగా ఖాయమైనట్లేనని అంటున్నారు. దీనిపై త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.