Tomato Juice : టమాటాలను చాలా మంది రోజూ వాడుతూనే ఉంటారు. వీటితో అనేక మంది కూరలు చేస్తుంటారు. వివిధ రకాల కూరగాయలతో కలిపి టమాటాలను వండుతుంటారు. అలాగే అనేక రకాల వంటల్లో వేస్తుంటారు. టమాటాలు లేనిదే చాలా మంది కూరలను పూర్తి చేయరు. అలా టమాటాలు మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఈ క్రమంలోనే రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక కప్పు టమాటా జ్యూస్‌ను తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. టమాటాల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూస్తాయి. కరోనా సమయంలో టమాటా జ్యూస్‌ను తాగితే ఎంతో మేలు జరుగుతుంది. దీంతో కరోనా రాకుండా అడ్డుకోవచ్చు.
2. అధిక బరువు తగ్గాలనుకునేవారికి టమాటా జ్యూస్ ఎంతగానో మేలు చేస్తుంది. దీన్ని తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీని వల్ల క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు.
3. కడుపులో అసౌకర్యం కలగకుండా ఉండేందుకు టమాటా జ్యూస్ ఎంతగానో పనిచేస్తుంది. కొందరికి భోజనం చేసిన వెంటనే జీర్ణాశయంలో అలజడి కలుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే టమాటా జ్యూస్‌ను తాగాలి.
4. టమాటాల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి సమస్యలను తగ్గిస్తుంది.
5. టమాటా జ్యూస్‌ను తాగడం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతోపాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
6. హైబీపీ ఎక్కువగా ఉన్నవారు టమాటా జ్యూస్‌ను తాగితే మేలు జరుగుతుంది. దీంతో బీపీ నియంత్రణలోకి వస్తుంది. అలాగే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు.