Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీలో పవన్‌తోపాటు రానా మరో కీలకపాత్రలో నటించారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ రికార్డులను తిరగరాస్తోంది. పవన్ కెరీర్‌లో ఈ మూవీ మరో హిట్ చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమాలో పవన్ టీ గ్లాస్‌త చాలా సార్లు కనిపించారు. దీంతో ఆ గ్లాస్ గురించే ఇప్పుడు చర్చంతా నడుస్తోంది.

ప్రస్తుతం చాలా వరకు అనేక ప్రాంతాల్లో.. ఇంకా చెప్పాలంటే మారుమూల ప్రాంతాల్లోనూ గాజు గ్లాస్‌లను టీ కోసం ఎవరూ ఉపయోగించడం లేదు. అనేక చోట్ల యూజ్ అండ్ త్రో పేపర్ కప్స్‌నే టీ కోసం వాడుతున్నారు. అయితే ఈ మూవీలో మాత్రం పవన్ గాజు టీ గ్లాస్‌తో కనిపించారు. దీంతో ఈ విషయంపై చర్చ నడుస్తోంది.
పవన్ కల్యాణ్ జనసేన పార్టీ గుర్తు టీ గ్లాస్. కనుక ఈ మూవీలో ఆ గ్లాస్‌ను అన్ని సార్లు చూపించారని తెలుస్తోంది. ఇక ఆ గ్లాస్ పై ఫోకస్ పడేలా సినిమాటోగ్రాఫర్ కూడా జాగ్రత్తలు పడ్డారు. అంటే ఈ మూవీ ద్వారా పవన్ తన రాజకీయ పార్టీని ప్రమోట్ చేసుకున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా పేపర్ కప్స్ కనిపిస్తున్నాయి. కానీ వాటిని కాదని పవన్ తన పార్టీ గుర్తు అయిన టీ గ్లాస్‌ను ప్రతిబింబించేలా సినిమా మొత్తం ఆ గ్లాస్‌లో టీ తాగారని అంటున్నారు.
అయితే ఇప్పుడు ఎలక్షన్స్ ఏమీ లేవు. కనుక భీమ్లా నాయక్‌కు ఇప్పుడు వచ్చే ఇబ్బందేమీ లేదు. కానీ ఎన్నికల సమయంలో ఇలా చేస్తే.. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తే.. అప్పుడు వారు ఈ సినిమాను ఎన్నికలు అయ్యే వరకు బ్యాన్ చేసి ఉండేవారని అంటున్నారు. మరి ఈ మూవీలో గాజు టీ గ్లాస్‌ను జనసేన ప్రచారం కోసం వాడుకున్నారా ? లేక మరేదైనా కారణం ఉందా ? అన్న వివరాలు తెలియాల్సి ఉంది.