Urfi Javed : హిందీ బిగ్‌బాస్ ఓటీటీ ఫేమ్ ఉర్ఫి జావేద్ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ అమ్మడు చేసే గ్లామర్ షో అంతా ఇంతా కాదు. సాధారణంగా హీరోయిన్లు ఫొటోషూట్ చేసినప్పుడు, ఏదైనా యాడ్‌లో నటించినప్పుడు లేదా సినిమాల్లో చేసినప్పుడు మాత్రమే అందాలను ఆరబోస్తుంటారు. కానీ ఉర్ఫి జావేద్ మాత్రం రోజూ అలాంటి డ్రెస్‌లే వేసుకుంటుంది. దీంతో ఆమె ఇంటి వద్ద ఎప్పుడు చూసినా ఫొటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించేందుకు సిద్ధంగా ఉంటారు. ఇక తాజాగా ఈమె వేసుకున్న ఇనుప డ్రెస్ ఫొటో వైరల్ అవుతోంది.
ఉర్ఫి జావేద్ తాజాగా ఇనుప చెయిన్స్‌తో కూడిన డ్రెస్‌ను ధరించింది. ముందు భాగంలో మొత్తం చెయిన్స్ ఉన్నాయి. ఇంకేమీ లేవు. అలాగే కింది భాగంలో జాలిలాంటి డ్రెస్ ధరించింది. దీంతో ఈ డ్రెస్‌తో బయటకు వచ్చిన ఈమెను ఫొటోలు, వీడియోలు తీశారు. ఇంకేముందీ.. అవి వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
ఉర్ఫి జావేద్‌కు ఇలాంటి డ్రెస్‌లు ధరించడం కొత్తేమీ కాదు. రోజూ ఆమె ఇలాంటి డ్రెస్‌లనే ధరిస్తుంటుంది. అంతేకాదు.. ఈ విషయంలో తనపై ట్రోల్ చేసే వారికి దీటుగా బదులిస్తుంది కూడా. అయితే ఈ అమ్మడు ఇంతలా షో చేసినా.. దర్శక నిర్మాతల దృష్టిలో పడితేనే.. ఫ్యూచర్‌లో అవకాశాలు వస్తాయి. అలా కాకుండా ఉంటే ఈమె ఎంత షో చేసినా ప్రయోజనం ఉండదు.