దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా గురించి తీవ్రంగా చర్చ నడుస్తోంది. అదే.. ది కాశ్మీర్ ఫైల్స్. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండానే ఒక సాధారణ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అఖండ విజయాన్ని సాధించి దూసుకుపోతోంది. త్వరలో ఈ మూవీ రూ.200 కోట్ల క్లబ్‌లో చేరనుంది. ఈ క్రమంలోనే చాలా మంది ఈ సినిమా బాగుందని అంటున్నారు. పాజిటివ్ టాక్‌తో ఈ మూవీ దూసుకుపోతోంది.
అయితే ఈ సినిమా మార్చి 11వ తేదీన రిలీజ్ అయింది కనుక నెల రోజుల్లో అంటే.. ఏప్రిల్ 11వ తేదీ వరకు ఓటీటీలోకి రావల్సి ఉంది. కానీ ఈ సినిమాకు ప్రస్తుతం వస్తున్న క్రేజ్ దృష్ట్యా మేకర్స్ ఓటీటీ డీల్‌ను మార్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ సినిమాను మే 6వ తేదీన ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాకు డిజిటల్ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. దీంతో ఆ యాప్‌లో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది.
ఇక కాశ్మీర్ ఫైల్స్ మూవీకి ప్రధాని మోదీ నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలని ఆయన అన్నారు. అలాగే పలు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వినోద పన్ను మినహాయించారు. ఇక ఇందులో పల్లవి జోసి, అనుపమ్ ఖేర్, దర్శ కుమార్ వంటి ప్రముఖ నటీనటులు కీలకపాత్రలను పోషించారు. వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. 1990లలో కాశ్మీర్‌లో జరిగిన పలు యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి భారీ ఎత్తున స్పందన లభిస్తోంది.