ప్రపంచంలో చాలా మందికి భిన్న రకాల రంగులు కలిగిన కళ్లు ఉంటాయి. అయితే నీలి కళ్లు ఉండేవారు మాత్రం ఒకే వ్యక్తి నుంచి వచ్చినట్లు సైంటిస్టులు చెబుతారు. సుమారుగా 10వేల ఏళ్ల కిందట నల్ల సముద్రం దగ్గర నివసించిన ఓ వ్యక్తికి జన్యు పరమైన మార్పుల వల్ల కళ్లు నీలి రంగులోకి మారాయి. అందువల్లే ఆ వ్యక్తి జన్యువులు నీలి కళ్లు ఉన్నవారికి వచ్చి ఉంటాయని సైంటిస్టులు భావిస్తున్నారు.
నైట్ విజన్ కళ్లద్దాలు మనకు పరిసరాలను గ్రీన్ కలర్లోనే చూపిస్తాయి. ఎందుకంటే గ్రీన్‌లోనే మన కళ్లు ఎక్కువ షేడ్స్ ను చూడగలుగుతాయి.
మన శరీరంలో అన్ని అవయవాల కన్నా కన్నుకు గాయం అయితే చాలా త్వరగా మానుతుంది. ఇక కార్నియాకు మరమ్మత్తులు చేసేందుకు కళ్లకు కేవలం 48 గంటల సమయం మాత్రమే పడుతుంది.
అప్పుడే పుట్టిన వారికి కన్నీళ్లు రావు. వారు ఏడ్చినట్లు శబ్దాలు చేస్తారు. 4-13 వారాల వయస్సు వస్తే వారికి కన్నీళ్లు వస్తాయి.
కొందరికి ఒక కన్ను ఒక కలర్లో, ఇంకో కన్ను మరో కలర్లో ఉంటాయి. ఈ స్థితిని హెటెరోక్రోమిక్ అని అంటారు.
అప్పుడే పుట్టిన పిల్లల కళ్లు పెద్దల కళ్లలో 65 శాతం సైజులో ఉంటాయి. వారు యుక్త వయస్సు వచ్చే సరికి మిగిలిన 35 శాతం కళ్లు పెరుగుతాయి.
మనం నిత్యం చూసే వాటికి చెందిన విషయాలను 80 శాతం వరకు గుర్తు పెట్టుకుంటాం.
మనిషి శరీరంలో అత్యంత క్లిష్టమైన అవయవాల్లో మెదడు తరువాత అవయవం కళ్లే.
* మనిషి ఒక కన్ను బరువు సుమారుగా 7.09 గ్రాముల వరకు ఉంటుంది.
* మనిషి కళ్లు సుమారుగా 1 కోటి వరకు భిన్న రకాల రంగులను గుర్తించగలవు.
* మన కళ్లు యుక్త వయస్సు వచ్చే వరకు పెరుగుతాయి. తరువాత పెరుగుదల ఆగిపోతుంది. కానీ ముక్కు, చెవులు మాత్రం జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి.
* ఏడాదిలో మనం కళ్లను సుమారుగా 42 లక్షల సార్లు ఆర్పుతాం.
* కళ్లలో సుమారుగా 20 లక్షల చిన్న చిన్న నిర్మాణాలు ఉంటాయి.
* ఒక్కో కంటిలో సుమారుగా 10.7 కోట్ల కణాలు ఉంటాయి. ఇవి కాంతిని తట్టుకోలేవు.
* మన శరీరంలో అత్యంత వేగవంతమైన కండరాలు కళ్లలో ఉంటాయి. అందుకనే కన్నార్పే క్షణాల్లోనే అంటారు. అంటే.. అంత వేగంగా ఆ కండరాలు పనిచేస్తాయి.
* ప్రపంచంలో అధిక శాతం మంది కళ్లు బ్రౌన్ కలర్లో ఉంటాయి.
* నీలి కళ్లు కావాలనుకునే వారు బ్రౌన్ కలర్ కళ్లకు సర్జరీ చేయించుకోవచ్చు. లేదా లెన్స్ ధరించవచ్చు.
* కళ్లను చూస్తే కొందరికి భయం కలుగుతుంది. దాన్ని Ommetaphobia అంటారు.
* చెవులకు రింగులను ధరించడం వల్ల కంటి చూపు పెరుగుతుందని సముద్రపు దొంగలు భావిస్తారు. అందుకనే వారి చెవులకు పోగులు ఉంటాయి.
* మనిషి కన్నును ఒక కెమెరాగా భావిస్తే.. దాని కెపాసిటీ 576 మెగాపిక్సల్స్. ప్రస్తుతం 108 మెగాపిక్సల్స్ కెపాసిటీ ఉన్న కెమెరాలు కలిగిన ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి.
* పులులు రాత్రి పూట మనుషుల కన్నా 8 రెట్లు ఎక్కువ స్పష్టంగా చూడగలవు.