Ears And Personalities : సాధారణంగా ఒక వ్యక్తి స్వభావం ఎలాంటిది..? అన్న విషయాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. కానీ మన కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు.. వీరి గురించైతే కాస్త తెలుస్తుంది. అయితే ఎవరూ తెలియని ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడం చాలా కష్టం. అతని స్వభావం ఎలా ఉంటుంది ? అతను ఎలాంటి వాడు ? అన్న విషయాలను అంత సులభంగా తెలుసుకోలేం. కానీ అతని చెవులను పరిశీలించడం ద్వారా అతను ఎలాంటి వాడు ? అన్న విషయాలను ఇట్టే తెలుసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఎదుటి వ్యక్తుల చెవులను చూసి వారు ఎలాంటి వారు ? అన్న వివరాలను ఎలా తెలుసుకోవాలి ? అన్న విషయాలను ఇప్పుడు చూద్దాం.
చాలా మందికి చిత్రంలో చూపించినట్లుగా దాదాపుగా 4 రకాల చెవులు ఉంటాయి. అవి ఆకారంలో మారుతుంటాయి. వీటిని చూసి వారి స్వభావం ఎలాంటిదో ఇట్టే చెప్పేయవచ్చు. చిత్రంలో చూపినట్లుగా మొదటి చెవిలా చెవులు పెద్దగా ఉన్నవారు లైఫ్‌లో ఎలాంటి సంఘటనలను అయినా, ఎలాంటి సవాళ్లను అయినా చాలా సులభంగా స్వీకరిస్తారు. దేన్నయినా చాలా సులభంగా, ప్రశాంతంగా ఎదుర్కొంటారు. ఎల్లప్పుడూ ఇతరులపై ఆధిపత్యం చెలాయిస్తారు. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వీరికి ఓర్పు ఎక్కువ. అంత సులభంగా విసుగు రాదు. ఏ పని అయినా మొదలు పెట్టారంటే అంత సులభంగా విడిచిపెట్టరు. సాధించే వరకు పోరాడుతారు. విరమించుకునే తత్వం ఉండదు. తమ సమస్యలను ఎవరి సహాయం లేకుండానే సాల్వ్ చేసుకుంటారు. భవిష్యత్తు గురించి ఆలోచించరు. వర్తమానంలోనే ఉంటారు.
చిత్రంలో చూపినట్లుగా చెవి తమ్మెలు చిన్నగా ఉన్నవారు ఎక్కువగా సిగ్గుపడే స్వభావం కలిగి ఉంటారు. బయటి వ్యక్తులతో అంత సులభంగా కలవరు. కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులతోనే చనువుగా ఉంటారు. వీరు ఏదైనా పని చేసే ముందు బాగా ఆలోచిస్తారు. అంతేకానీ తొందరపడి ఏ పని చేయరు. అలాగే సమాజంలో నలుగురిలో కలవాలన్నా టైమ్ తీసుకుంటారు.
చెవి తమ్మెలు చెవితో కలిసి పోయి ఉన్నవారు అధికంగా భావోద్వేగాలను కలిగి ఉంటారు. వీరు తమ భావోద్వేగాలను నియంత్రించుకోలేరు. కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా, నవ్వు వచ్చినా వెంటనే చేస్తారు. తట్టుకోలేరు. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ధైర్యంగా భవిష్యత్తు కోసం అడుగులు వేస్తారు.
చిత్రంలో చూపినట్లుగా చివరి చెవి మాదిరిగా చెవి తమ్మెల మధ్యలో ఒత్తినట్లుగా షేప్ కలిగి ఉన్నవారు ఎక్కువగా సృజనాత్మక శక్తిని కలిగి ఉంటారు. వీరికి ఊహా శక్తి ఎక్కువ. వీరు తమదైన కోణంలో ప్రపంచాన్ని చూడగలుగుతారు. వీరు తమ భావాలను పంచుకునేందుకు ఏమాత్రం వెనుకడుగు వేయరు. అలాగే వీరు ఎక్కువ ప్రతిభావంతులుగా, నిపుణులుగా ఉంటారు. ఇలా ఎదుటి వారి చెవి ఆకారాన్ని బట్టి వారి స్వభావాన్ని అంచనా వేయవచ్చు.