Turmeric Water : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే పసుపును తమ నిత్య జీవితంలో ఉపయోగిస్తున్నారు. ఇది అనేక ఏళ్ల నుంచి వంట ఇంటి పదార్థంగా ఉంది. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అయితే పసుపును రోజూ తీసుకోవాలని తెలుసు. కానీ దాన్ని ఎలా తీసుకోవాలో చాలా మందికి తెలియదు. పసుపును కింద చెప్పిన విధంగా తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.

ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసిన తరువాత వేడి నీటిలో పావు టీస్పూన్ పసుపు కలుపుకుని తాగేయాలి. దీని వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. ఇలా తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్, బీపీ తగ్గుతాయి. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఇక ఈ విధంగా పసుపును తీసుకోవడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. పసుపులో సహజసిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల జ్వరాలు, ఇన్‌ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి. వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇలా పసుపును వేడి నీటిలో కలిపి తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఉదయం తాగే కాఫీ, టీలకు బదులుగా ఈ నీటిని తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది.