Piper Longum : ఆయుర్వేదంలో మనకు ఎన్నో రకాల మూలికలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పిప్పళ్లు ఒకటి. ఇవి చాలా ఘాటుగా, కారంగా ఉంటాయి. వీటిని సరిగ్గా ఉపయోగించాలే కానీ మనకు అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. పిప్పళ్లతో అనేక వ్యాధుల నుంచి బయట పడవచ్చు. పిప్పళ్లను ఎలా ఉపయోగిస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పిప్పళ్ల పొడిని అర టీస్పూన్ మోతాదులో తీసుకుని దానికి ఒక టీస్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం భోజనం చేశాక ఒక గంట తరువాత తీసుకోవాలి. ఇలా రోజూ తీసుకుంటుంటే ఎంతటి బానపొట్ట అయినా సరే తగ్గిపోతుంది. శరీరంలోని కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు.
2. అర టీస్పూన్ పిప్పళ్ల పొడిని తీసుకుని చిన్న బెల్లం ముక్కతో కలిపి తినాలి. ఎలాంటి శ్వాసకోశ సమస్య అయినా సరే తగ్గిపోతుంది. రోజుకు ఇలా రెండు సార్లు తీసుకోవాలి. దీని వల్ల దగ్గు, ఆస్తమా, జలుబు తగ్గిపోతాయి.
3. పిప్పళ్ల పొడిని బెల్లంతో తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ సైతం శుభ్రమవుతుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. మలబద్దకం సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. అజీర్ణం తగ్గుతుంది.
4. పిప్పళ్ల పొడిని వేసి మరిగించిన నీటిని ఒక కప్పు మోతాదులో రోజుకు ఒక్కసారి తాగాలి. దీని వంల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వాపుల నుంచి బయట పడవచ్చు.
5. పిప్పళ్ల పొడిని కాస్త తీసుకుని దాన్ని నెయ్యిలో కలిపి ఉదయాన్నే పరగడుపునే తింటుండాలి. దీంతో గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.