సాధారణంగా సీజన్లు మారినప్పుడు సహజంగానే ఎవరికైనా సరే దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ, ఫ్లూ జ్వరం వంటివి వస్తుంటాయి. అవి ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉంటాయి. దీంతో తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. అయితే ఇందుకు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతోనే సహజసిద్ధమైన దగ్గు మందును తయారు చేసి నిత్యం తీసుకోవచ్చు. దీంతో ఆయా సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
సహజసిద్ధమైన దగ్గు మందును ఇలా తయారు చేసుకోండి
* ఒక చిన్నసైజు ఉల్లిపాయను తీసుకుని దాని నుంచి రసం తీయాలి.
* 3 టేబుల్ స్పూన్ల మోతాదులో ఉల్లిపాయ రసాన్ని తీసుకోవాలి.
* 2 టేబుల్ స్పూన్ల తేనెను తీసుకోవాలి.
* చిటికెడు సోంపు గింజలను పొడిగా చేసి కొద్దిగా నీరు కలిపి జ్యూస్‌లా తయారు చేయాలి.
పైన తెలిపిన మూడు పదార్థాలను ఆయా మోతాదుల్లో తీసుకుని వాటిని బాగా మిక్స్ చేయాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని నిత్యం రెండు పూటలా తీసుకోవాలి. దీంతో దగ్గు మాత్రమే కాదు, జలుబు, ముక్కు దిబ్బడ కూడా తగ్గిపోతాయి. ఈ మూడింటిలో ఉండే యాంటీ బయోటిక్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ వైరల్ గుణాలు దగ్గు, జలుబులను త్వరగా తగ్గిస్తాయి.