Poori : మనం సాధారణంగా గోధుమ పిండితో చపాతీలను, పూరీలను తయారు చేస్తూ ఉంటాం. చపాతీలను ప్రతి రోజూ తినే వారు ఉంటారు. పూరీలను కనీసం వారంలో ఒక్కసారి అయినా తినే వారు ఉంటారు. వీటిని మనం ఎక్కువగా ఆలు కూరతో కలిపి తింటాం. చిన్న పిల్లలకు, కొంత మంది పెద్దవారు కూడా పంచదార, బెల్లం వంటి వాటితో కలిపి వీటిని తింటూ ఉంటారు. కొందరు ఎటువంటి కూర, పంచదార వంటివి లేకుండా తింటూ ఉంటారు. చపాతీ, పూరీలను పెరుగుతో కలిపి తినే వారు కూడా ఉంటారు.
గోధుమలలో గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉంటుంది. గోధుమలల్లో12 నుండి 14 శాతం వరకు గ్లూటెన్ ఉంటుంది. ఇతర ధాన్యాలలో ఈ గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉండదు. ఈ ప్రోటీన్ కారణంగానే గోధుమలు బంకగా జిగురుగా ఉంటాయి. చిన్న పిల్లలు గోధుమ పిండితో చేసిన చపాతీలను కానీ పూరీలను కానీ తినప్పుడు కడుపు నొప్పి రావడాన్ని మనం గమనించవచ్చు. గోధుమలల్లో ఉండే ఈ గ్లూటెన్ చపాతీలను, పూరీలను తిన్నప్పుడు ప్రేగుల గోడలకు అతుక్కుపోయి, సరిగ్గా జీర్ణమవ్వక కడుపు నొప్పి, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు రావడం జరుగుతుంది.
చపాతీలను, పూరీలను అధికంగా తినడం వల్ల ప్రేగులల్లో గ్లూటెన్ పేరుకు పోయి ప్రేగులు మనం తినే ఆహార పదార్థాల నుండి పోషకాలను గ్రహించే శక్తిని కోల్పోతాయని.. అంతే కాకుండా ప్రేగులల్లో ఉండే శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉత్పత్తి కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. పెరుగు, పంచదార వంటి వాటితో లేదా నేరుగా చపాతీలను, పూరీలను తిన్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతుందని వారు చెబుతున్నారు.
పీచు ఎక్కువగా ఉండే కూరగాయలతో చేసిన కూరలను ఎక్కువ మొత్తంలో తీసుకుంటూ చపాతీలను, పూరీలను తినడం వల్ల వీటిలో ఉండే పీచు పదార్థాలు ప్రేగుల గోడలకు అతుక్కుపోయిన గ్లూటెన్ ను కూడా మలంలో కలిసేలా చేస్తాయి. గోధుమలలో పీచు పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఆకు కూరలను, పీచు పదార్థాలు కలిగిన కూరలను అధికంగా తీసుకుంటూ తినడం వల్ల చపాతీలు, పూరీలను తిన్నా కూడా ఎటువంటి హాని కలగదని నిపుణులు చెబుతున్నారు.